కర్ణాటకకు కరోనా షాక్... ఒక్క రోజులోనే కేసులు డబుల్

గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 918 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మరణించారు. 371 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

news18-telugu
Updated: June 27, 2020, 9:24 PM IST
కర్ణాటకకు కరోనా షాక్... ఒక్క రోజులోనే కేసులు డబుల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కొంతకాలం నుంచి కొన్ని రాష్ట్రాల్లో కరోనా అదుపులో ఉందని కరోనా కేసుల లెక్కలను చూస్తే అనిపించింది. అయితే అలాంటి రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు రోజూ వారీగా ఐదు వందలలోపే నమోదవుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య... గడిచిన 24 గంటల్లో రెట్టింపు కావడం టెన్షన్ పెడుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 918 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మరణించారు. 371 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,923కి చేరింది. వీరిలో 4,441మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 7,287మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 191మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో, ప్రత్యేకంగా బెంగళూరులో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం యడియూరప్ప... ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్ పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఆ తరువాత మళ్లీ లాక్‌డౌన్‌పై మాట మార్చారు. అలాంటి ఆలోచన లేదని వివరణ ఇచ్చారు.

First published: June 27, 2020, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading