హృతిక్ రోషన్ జీవితాన్ని మార్చేసిన కరోనా వైరస్..

భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ రోషన్ (File/Photo)

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి. ఈ వైరస్ కారణంగా అందరు సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ వైరస్ ఇపుడు హృతిక్ రోషన్ జీవితాన్ని మార్చేసింది.

  • Share this:
    కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి. ఈ వైరస్ కారణంగా అందరు సామాజిక దూరం పాటిస్తున్నారు. సామాజిక దూరంతోనే కరోనాను నియంత్రించవచ్చనే పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి ఒక్కరు షేక్ హ్యాండ్ చేసుకోవాలన్న ఆలోచించే పరిస్థితి కల్పించింది కరోనా. అలా కరోనా మనుషులను విడదీస్తుంటే .. హృతిక్ రోషన్‌ను, ఆయన సుజానేను ఒక్కటిగా చేసింది. ఆరేళ్ల క్రితమే హృతిక్.. తన భార్య సుజానేకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీళ్లు తల్లి దగ్గర కొన్ని రోజులు, తండ్రి దగ్గర మరికొన్నాళ్లు ఉంటున్నారు. ఐతే.. పండగలను ఇతర వేడుకలను వీళ్లిద్దరు తమ పిల్లలతో కలిసి చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం హృతిక్ దగ్గర పిల్లలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనాను నియంత్రించే భాగంగా కేంద్రం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దాంతో పిల్లలను సుజానే మిస్ అవుతున్నారు.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సుజానే మూట ముల్లే సర్ధుకుని తన మాజీ భర్త హృతిక్ రోషన్ ఇంటికి వచ్చేసింది. ఈ టైమ్‌లో పిల్లలతో పాటు తను ఉండటం చాలా ముఖ్యమన్నారు హృతిక్. పిల్లల కోసం తన ఇంటికి వచ్చిన సుజానేకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు హృతిక్ రోషన్. మొత్తానికి కరోనా వైరస్ కారణంగా విడిపోయిన వీళ్లిద్దరు ఒక ఇంట్లో ఉండటం చాలా ఆనందించదగ్గ పరిణామం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: