Coronavirus | Covid 19 | Work from Home : కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాకౌట్ ప్రకటించడంతో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలూ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యిస్తున్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా... ఆఫీస్‌లో చేసిన పనికీ, ఇంట్లో చేసిన పనికీ తేడా కచ్చితంగా ఉంటుంది. ఎంత పోల్చుకున్నా... ఆఫీస్‌లోనే పని ఎక్కువ జరుగుతుంది. ఇందుకు కారణం... ఆఫీస్ ఎన్విరాన్మెంటే. ఉద్యోగులు పని చెయ్యడానికి అక్కడ అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. పూర్తిగా పని పైనే శ్రద్ధ పెట్టేందుకు వీలవుతుంది. అదే ఇళ్లలో అయితే... ఏకాగ్రతతో పని చెయ్యడం చాలా కష్టం. ఇంట్లో వాళ్ల సమస్యలు, రోజు వారీ పనులు ఇలాంటివి గుర్తొస్తూ... పనిపై శ్రద్ధను తగ్గించే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే... వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది... వినడానికి ఆనందంగా... చెయ్యడానికి కష్టంగా ఉండే అంశం అనుకోవచ్చు. అయినప్పటికీ... వర్క్ ఫ్రమ్ హోం ద్వారా కూడా అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు నిపుణులు. ఎలాగో ఫటాఫట్ తెలుసుకుందాం.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే చాలా మంది ఉద్యోగులు లైట్ తీసుకుంటారు. చెయ్యొచ్చులే, పూర్తవుతుందిలే అని పనిని వాయిదా వేస్తుంటారు. అలా అస్సలు చెయ్యొద్దు. మనం రెండు పూటల భోజనాన్ని ఒకేసారి ఎలా తినలేమో... పని కూడా అంతే... ఎప్పటిదప్పుడు పూర్తైపోవాల్సిందే. వాయిదా వేస్తే... పెరిగేది టెన్షనే.
వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ... కచ్చితమైన సమయపాలన ముఖ్యం. అలర్ట్‌గా, నిబద్ధతతో పనిచెయ్యాలి. ఆఫీస్‌లో ఉన్నట్లే ఫీల్ అవ్వాలి. బ్రేక్ఫాస్టులు, భోజనాల్ని ఆఫీస్‌లో ఉన్నట్లే చకచకా ఫినిష్ చేసి... పనిలో దిగిపోవాలి. ఇందుకోసం అవసరమైతే అలారం క్లాక్ కూడా సెట్ చేసి పెట్టుకుంటే మంచిదే. పని మొదలుపెట్టే ముందే... ఆ రోజు ఏం తినాలో ఫిక్సైపోండి. తద్వారా తర్వాత ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు.
వర్క్ ఎట్ హోమ్ కదా అని డ్రెస్ కోడ్ లేకుండా ఉండొద్దు. మంచి డ్రెస్ వేసుకున్నప్పుడే... పని బాగా చెయ్యగలరని పరిశోధనల్లో తేలింది. కాబట్టి... మీ షిఫ్ట్ టైమ్ ప్రకారం... చక్కగా రెడీ అయ్యి, మంచి డ్రెస్ వేసుకొని... కంఫర్ట్‌గా ఉంటూ... పనిలోకి దిగితే... అదే పక్కాగా అవుతుంది.
ఇంట్లోనే ఆఫీస్ లాగా ఏర్పాటు చేసుకోండి. ఇంటినీ వర్క్ స్పేస్నీ వేరు చేసుకోండి. ఇంట్లో విషయాల్ని వర్క్ స్పేస్‌లోకి రానివ్వకండి. టీవీ గోల, పిల్లల అల్లర్లు, ఏం వండుకోవాలి, ఏం తినాలి వంటి విషయాల్ని మీ పనిపై ప్రభావం పడకుండా చూసుకోండి.
ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటే... ఆ డెస్కు, ఆ సిస్టమ్ స్పేస్ అన్నీ పద్ధతిగా ఉంటాయి. ఇంట్లో అలాంటి ఏర్పాటు లేకపోతే ఇబ్బందే. వీలైనంత త్వరగా అలాంటి సెట్టింగ్ చేసుకుంటే... మెడ నొప్పి, భుజం నొప్పి, బద్ధకం, అలసట వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీరు టైపింగ్ చేసేటప్పుడు... మీ మోచేతుల కంటే కీబోర్డ్ పైకి ఉండకుండా జాగ్రత్త పడాలి. కీబోర్డ్ కంటే, చేతులు కిందకు ఉంటే... మీకు మెడ వెనక వీపు భాగంలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
గోల్స్ పెట్టుకోండి. ఎంత పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి... వంటి టైమ్ స్లాట్స్ పెట్టుకొని... ఆయా స్లాట్స్‌లో అది పూర్తైపోయేలా చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పనిని వాయిదా వెయ్యకండి.
పనిని ప్రేమించండి. ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చెయ్యించడం అంటే కంపెనీల యాజమాన్యాలకు అది ఇబ్బందికర అంశమే. అయినప్పటికీ కరోనా వైరస్‌ని దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగుల క్షేమం దృష్ట్యా ఇలా చేయిస్తున్నారన్న విషయం మర్చిపోకూడదు. కంపెనీ బాగుంటేనే ఉద్యోగులు బాగుంటారు కాబట్టి... పని విషయంలో అశ్రద్ధ చెయ్యకపోవడం అందరికీ మేలు.
పని సమయంలో లేదా మీ షిష్ట్ సమయంలో మీరు ఒంటరిగా పని చేసేందుకు సిద్ధపడితే మేలు. ఇంట్లో వాళ్లతో మాటల్లో పడితే... పని పక్కకు పోయే ప్రమాదం ఉంటుంది. అది మీ కెరీర్‌ని దెబ్బ తీస్తుంది. అదే సమయంలో... మీ బాస్, కొలీగ్స్‌తో మాత్రం టచ్‌లో ఉండాలి. తద్వారా పోటీ తత్వం అలవడి... పనిలో వేగం తగ్గకుండా ఉంటుంది.
మీ టీమ్‌లో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో బాగా పనిచేస్తుంటే... అది ఎలా సాధ్యమవుతోందో తెలుసుకోండి. ఆ టిప్స్ మీరు కూడా పాటించే వీలుంటే ప్రయత్నించండి.
పని మొదలయ్యాక... ల్యాప్‌టాప్ సరిగా లేదనో, నెట్ సరిగా రావట్లేదనో ఇబ్బంది పడితే... అది పనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్నీ ముందే సెట్ చేసుకొని పనిలో దిగితే... ఇక ఆగే ప్రసక్తే ఉండదు.
మీ ఇల్లు రోడ్డు పక్కనో, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పక్కో ఉంటే... మీకు మాటిమాటికీ రణగొణ ధ్వనుల సమస్య ఉంటుంది. అలాంటప్పుడు డోర్లు వేసుకొని పనిచెయ్యడం మేలు. ఐతే... డోర్లు క్లోజ్ చేస్తే... కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది, అలాగే ఎండ వల్ల వేడి కూడా ఎక్కువవుతుంది. అందువల్ల ప్రతీ రెండుగంటలకోసారి ఓ పది నిమిషాలు డోర్లు తెరచి... తర్వాత మళ్లీ మూసేసుకోవడం మేలు.
పని చేసేటప్పుడు రెగ్యులర్‌గా వాటర్ తాగండి. అలాగే... బాగా అలసటగా, బోర్ కొట్టేస్తున్నట్లైతే... ఓ మూడు నిమిషాలు మ్యూజిక్ వినడమో... కామెడీ సీన్ చూడటమో చెయ్యండి. ఆ తర్వాత వెంటనే మళ్లీ పనిలోకి వచ్చేయండి. అంతేగానీ... బాగుంది కదా అని మైండ్ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్లిందంటే మాత్రం పని అటకెక్కిపోతుంది. ప్రతీ క్షణం అలర్ట్‌గా ఉండాల్సిందే.
మీ పని పూర్తైన తర్వాత... ఇక ఆ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఎవరూ టచ్ చెయ్యకుండా, పాడు చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మళ్లీ నెక్ట్స్ డే పని మొదలు పెట్టాలి కదా. ప్రతి రోజూ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయో లేదో పనిలో దిగే రెండు గంటల ముందే చూసుకోండి. ఏ ఎలకలో వైర్లను కొరికేసి ఉంటే... ముందే రిపేర్ చేసుకోండి. ఒక్కసారి సిస్టం ముందు కూర్చుంటే... ఇక పనైపోవాలంతే.
ఇన్ని చక్కటి చిట్కాలు పాటిస్తున్నా కొంత మంది ఎందుకోగానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యలేరు. దీన్నే డెస్క్ సిక్నెస్ అంటారు. అలాంటి వాళ్లు ఇళ్లలో పని చెయ్యలేరు. ఆఫీస్‌లో మాత్రమే చెయ్యగలరు. పరిస్థితి అంత తీవ్రంగా ఉంటే మాత్రం... ఆఫీస్‌కి వెళ్లి పనిచేసుకోవడమే బెటర్. ఐతే... ప్రపంచంలో ఇలాంటి సిక్నెస్ ఉన్నవారు... ఈ రోజుల్లో దాదాపు కనిపించట్లేదు.
!function(e,i,n,s){var t="InfogramEmbeds",d=e.getElementsByTagName("script")[0];if(window[t]&&window[t].initialized)window[t].process&&window[t].process();else if(!e.getElementById(n)){var o=e.createElement("script");o.async=1,o.id=n,o.src="https://e.infogram.com/js/dist/embed-loader-min.js",d.parentNode.insertBefore(o,d)}}(document,0,"infogram-async");
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Work From Home