రామ్‌చరణ్ మామ చేసిన పనికి నెటిజన్లు ఫిదా...దండాలయ్యా అంటూ...

రామ్‌చరణ్ మామ చేసిన పనికి నెటిజన్లు ఫిదా...దండాలయ్యా అంటూ...

రామ్‌ చరణ్, ఉపాసన (Ram Charan Upasana)

కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీమ్ ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ తయారీ చేసి, ప్రజల్లో కరోనా నుంచి కాపాడుకునే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొండా చేసిన పనికి అటు రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు.

  • Share this:
    మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సామాన్య ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ తయారు చేసుకోవచ్చని ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం మార్కెట్లో హ్యాండ్ సానిటైజర్ల కొరత ఏర్పడింది. అంతేకాదు 50 ఎంఎల్ సానిటైజర్ ధర రూ.100 దాకా పలుకుతోంది. మరికొన్ని మెడికల్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఎలా తయారుచేసుకోవాలని అనే అంశంపై ఆయన వీడియో విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీమ్ ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ తయారీ చేసి, ప్రజల్లో కరోనా నుంచి కాపాడుకునే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొండా చేసిన పనికి అటు రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. రామ్ చరణ్ కు వరుసకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మామ అవుతారు.
    Published by:Krishna Adithya
    First published: