Corona Alert : ఇండియాలో కరోనా వైరస్... ఈ జాగ్రత్తలు పాటించండి...

Corona Alert : ఇండియాలో కరోనా వైరస్... ఈ జాగ్రత్తలు పాటించండి...

ప్రతీకాత్మక చిత్రం

Corona Alert : మన కంటే అభివృద్ధి చెందిన చైనాయే కరోనా వైరస్‌ని ఆపలేకపోతోంది. అలాంటప్పుడు ఆ వైరస్ వ్యాప్తిని భారతీయులు అడ్డుకోవాలంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా చెయ్యండి.

 • Share this:
  Corona Alert : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఇండియాలో కరోనా వైరస్ వచ్చేసింది. కేరళలో ఓ వ్యక్తిలో కరోనా వైరస్ ఉన్నట్లు తెలిసింది. మరో వ్యక్తికి కూడా ఇది సోకినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్... ఒకరికి సోకితే... ఆ ఒకరి నుంచీ మరో ముగ్గురు, నలుగురికి సోకుతోంది. ఆ లెక్కన ఒకరికి వచ్చే వ్యాధి మరో నలుగురికి... ఆ తర్వాత ఆ నలుగురి నుంచీ మరో 20 మందికి... ఆ 20 మంది నుంచీ మరో 75 మందికి సోకే ప్రమాదం ఉంది. ఇలా రోజురోజుకూ ఈ వైరస్ వ్యాప్తి వేగంగా పెరిగేలా ఉంది. అందుకే చైనా సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఈ వైరస్‌ని అడ్డుకోలేకపోతున్నాయి. మన ఇండియా... అంతగా అభివృద్ధి చెందిన దేశం కాదు, పైగా మన దేశంలో జనాభా సంఖ్య ఎక్కువ. అందువల్ల ఇక్కడ తగిన జాగ్రత్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటూ మనం కూడా తీసుకోవాలి. అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.

  సాధారణంగా వైరస్ అనేవి... వ్యక్తి దగ్గినా, తుమ్మినా... తుంపర్ల ద్వారా మిగతా వ్యక్తులకు సోకుతాయి. కరోనా వైరస్ కూడా అలాంటిదే. రోగి రిలీజ్ చేసే ఉమ్ము, ముక్కులో ద్రవాల ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తోంది. సపోజ్ వైరస్ ఉన్న వ్యక్తి మన పక్కనే ఉండి... ఓసారి తుమ్మినట్లు భావిస్తే... ఆ తుమ్ములో తుంపర్లలో వైరస్ (సూక్ష్మక్రిములు)... అలా ఎగురుతూ... ఓ గోడపై పడ్డాయనుకుందాం. మనకు తెలియకుండా మనం మన చేతిని ఆ గొడపై ఆనించితే... వెంటనే ఆ వైరస్... మన చేతి వేళ్లపై ఎక్కుతుంది. ఆ తర్వాత మనం... ఆ చేతిని... అనుకోకుండా మన ముఖంపై టచ్ చేసుకుంటే... చేతిపై ఉన్న వైరస్... ముఖంపైకి వెళ్తింది. అది క్రమంగా... నోరు లేదా ముక్కు ద్వారా శరీరం లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత తిన్నగా ఊపిరి తిత్తుల లోపలికి వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని... ఊపిరి తిత్తుల్ని తింటూ... రోగాన్ని పెంచుతూ జీవిస్తుంది వైరస్. అందువల్ల మనం... కంటిన్యూగా 10 నిమిషాల కంటే ఎక్కువగా తుమ్మేవారు, దగ్గేవారికి కాస్త దూరంగా (ఆరు అడుగుల దూరం) ఉండాలి. వాళ్లు తుమ్మిన తర్వాత మన చేతుల్ని ఇంటికి వెళ్లి శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. స్నానం చేస్తే ఇంకా మేలు. లేదంటే... పైన చెప్పినట్లు జరిగే ప్రమాదం ఉంటుంది.

  బస్సులు, ఆటోలు, రైళ్లు, MMTSలు, మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు... వాటిలో సీట్లు, రాడ్లు పట్టుకోవాల్సి వస్తుంది కదా. అందువల్ల వారంతా... ఇంటికి వెళ్లాక చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. అలాగే... స్కూల్ విద్యార్థులు స్కూళ్లలో డెస్కుల్ని టచ్ చేస్తారు. వాళ్లు కూడా ఇంటికి వెళ్లాక... సబ్బుతో కడుక్కోవాలి. చేతుల్ని అత్యంత శుభ్రంగా కడుక్కోవాలి. వేళ్లు, గోర్లూ అన్నీ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖానికీ, ముక్కుకీ మస్ట్‌గా మాస్క్ వాడాలి. తద్వారా మనం వైరస్‌ను గాలిద్వారాగానీ, మన చేతుల ద్వారా గానీ... లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నట్లు అవుతుంది. ఇతరులు మనల్ని చూసి ఏమనుకుంటారో అని మొహమాటం పడకుండా... కచ్చితంగా మాస్కులు, కర్ఛీఫ్‌లు, ఇతరత్రా క్లాత్‌లను వాడాలి. ఏం చేసైనా సరే... వైరస్ ముక్కు, నోటి ద్వారా లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి.

  ఇకపై ఎవరైనా సరే... తుమ్ము, దగ్గు లాంటివి వస్తే... టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకొని తుమ్మాలి. తర్వాత దాన్ని వెంటనే మడతపెట్టి... డస్ట్ బిన్‌లో వేసి... చేతుల్ని కడుక్కోవాలి. టైముకి టిష్యూ పేపర్ లేకపోతే... చేతిని మడతపెట్టి... మణికట్టు దగ్గర తుమ్మాలి. అంతే తప్ప... అరచేతిని అడ్డుపెట్టుకొని తుమ్మకూడదు, దగ్గకూడదు. ఎందుకంటే... ఆ అరచేతులతోనే అన్నీ పట్టుకుంటాం. పొరపాటున అరచేతిలో వైరస్ ఉంటే, అది ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా... వైరస్ సోకదన్న గ్యారెంటీ లేదు. అసలా వైరస్ ఎలా వ్యాపిస్తోందో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందువల్ల ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే... దగ్గు, జ్వరం, కంటిన్యూగా ముక్కు కారుతూ ఉంటే... వెంటనే డాక్టర్‌ని కలవాలి. ఎంత త్వరగా కలిస్తే... అంతగా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుంది.

  జంతువులు, పక్షులు, ప్రాణులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కరోనా వైరస్ వచ్చిందే పాము, గబ్బిలం లాంటి జంతువులు, ప్రాణుల్లోంచీ. ఇప్పుడు అది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. మనుషుల నుంచీ ప్రాణులకు కూడా వ్యాపించగలదు. అందువల్ల మనం అంతగా శుభ్రత లేని జంతువులు, పక్షులు, ప్రాణులకు దూరంగా ఉండాలి. బయట తినే ఆహార పదార్థాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ సరుకు, ఈగలు, దోమలు ముసురుతూ ఉండేవి ఎట్టి పరిస్థితుల్లో తినవద్దు. మాంసం, చికెన్ వంటివి కొనేముందు... అవి తాజాగా ఉన్నాయో లేదో బాగా చెక్ చేసి తీసుకోవడం మేలు.

  మీ చుట్టుపక్కల ఎవరైనా చైనా నుంచీ వచ్చిన వారుంటే... ఓ రెండు వారాల పాటూ వాళ్లను కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వైరస్ సోకిన విషయం 2 వారాల వరకూ తెలియదు. చైనా నుంచీ వచ్చిన వాళ్లు కూడా రెండు వారాల పాటూ ఇళ్లలోనే ఉండాలి. కరోనా వైరస్ లక్షణాలు మీలో ఉంటే... ఇంట్లోనే ఉండి డాక్టర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పడం మేలు. డాక్టర్ రమ్మంటేనే వారి దగ్గరకు వెళ్లడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే... కరోనా వైరస్ బారి నుంచీ తప్పించుకోవడానికి వీలవుతుంది.
  Published by:Krishna Kumar N
  First published: