కరోనా(Corona) మహమ్మారి ఇప్పటికే రెండు పర్యాయాలు యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అది కూడా స్వల్పకాలంలోనే ఎంతో మందికి నిద్ర లేకుండా చేసింది. త్వరలో థర్డ్ వేవ్(Third Wave) రాబోతుందని, ఈ సారి చిన్నారులపై ప్రభావం అధికంగా పడుతుందని ఇప్పటికే సంకేతాలు వచ్చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చాలా రాష్ట్రాలు పాఠశాలలను పునఃప్రారంభించడానికి సంకోచిస్తున్నాయి. తరగతి గదుల్లో పిల్లల ఆరోగ్య భద్రత(Health Security) గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌హెల్త్ (Berlin Institute of Health) చేసిన అధ్యయనంలో పిల్లల ఆరోగ్యం గురించి బాధపడుతున్న తల్లిదండ్రులకు కొంత ఊరట కలిగించే అంశాలు బయటపడ్డాయి.
పెద్దలతో పోలిస్తే పిల్లలపై పెద్దగా ప్రభావం చూపదనే విషయం ఇప్పటికే తెలిసినప్పటికీ పిల్లలు కరోనా నుంచిఎలా తట్టుకోగులుగుతున్నారో పరిశోధకుల కనుగొన్నారు. ఇమ్యూన్ పవర్ పెద్దల కంటే పిల్లల్లో అధికంగా ఉండటానికి కారణమైన మాలిక్యూలర్ మెకానిజంపై బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(BIH), లీఫ్జిగ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం, హైడెల్ బర్గ్‌లో ఉన్న జర్మన్ క్యాన్సర్ రిసెర్స్ సెంటర్ పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. పెద్దవారితో పోలిస్తే పిల్లల రోగనిరోధక వ్యవస్థలో ఉండే ఎగువు వాయుమార్గాలు చురుకుగా ఉన్నాయని, ఇవి వైరస్ తో బాగా పోరాడటానికి తోడ్పుడుతున్నాయని అధ్యయనవేత్తలు తెలిపారు. దీనిపైబీఐహెచ్ మాలిక్యూలర్ ఎపిడెమియాలజీ అధ్యయనవేత్తఇరినా లెమన్ మాట్లాడుతూ "పెద్దల కంటే పిల్లల్లో వైరల్ డిఫెన్స్ ఎందుకు బాగా పనిచేస్తుందనే విషయంపై ప్రధానంగా మా పరిశోధన కొనసాగింది.
Kitchen Cleaning Tips: వంటగదిని శుభ్రం చేయాలా.. ఈ చిట్కాలను పాటించండి.. గదంతా ధగధగ మెరిసిపోతుంది..
వైరస్ జన్యువును గుర్తించే సామర్థ్యం పెద్దల కంటే పిల్లల్లో బలంగా ఉందని అధ్యయనంలో తేలింది." అని వివరించారు. కాగా,ఈ పరిశోధనకు ఛారిటే మెడికల్ సెంటర్ పీడియాట్రిక్ విభాగం అధ్యాపకులు మార్కస్ మాల్ నేతృత్వం వహించారు.SARC-CoV-2 సోకిన పిల్లలు, పెద్దల నాసికా రంధ్రం నుంచి నమూనాలను సేకరించిన శాస్త్రవేత్తలు వ్యాధి పురోగమించిన విధానంపై అధ్యయనం చేశారు. "చాలా మంది పిల్లల్లో జలుబు లేదా స్వల్పజ్వరం లాంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఇవి కొన్ని రోజుల తర్వాత తగ్గిపోయాయి" అని మార్కస్ మాల్ తెలిపారు. ఇందుకోసం 42 మంది చిన్నారులు, 44 మంది పెద్దల నుంచి సేకరించిన మొత్తం 269,745 కణాలను విశ్లేషించారు.తమ పరిశోధనలను నేచర్ బయోటెక్నాలజీ జర్నల్లో ప్రచురించారు.
పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ..
పిల్లలు, పెద్దల నుంచి పొందిన కణాల పోలిక ఆశ్చర్యకరమైన ఫలితాన్ని అందించింది. ఆరోగ్యకరమైన పిల్లల నాసిక నమూనాలు రోగనిరోధక, ఎఫిథీలియాల్ కణాలు అప్పటికే అప్రమత్తంగా ఉన్నాయని, కరోనా వైరస్ తో పోరాడటానికి సిద్ధమయ్యాయని కనుగొన్నారు. వైరస్కు వ్యతిరేకంగా వేగవంతమైన రోగనిరోధక ప్రతిస్పందనకు నమునా గుర్తింపు గ్రాహకాలు అని పిలిచే క్రీయాశీలత అవసరమైంది. ఇది వైరస్ జన్యువు-వైరల్ ఆర్ఎన్ఏను గుర్తించి ఇంటర్ ఫెరాన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. వైరస్ కణానికి సోకినప్పుడు ఇది సాధారణంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది. ఫలితంగా బలహీన యాంటీ వైరల్ రెస్పాన్స్ కణంలోకి వెళ్లేందుకు అనుమతిస్తుంది. అయితే పిల్లల కణాల్లో ఈ నమూనా గుర్తింపు పెద్దల కంటే బలంగా ఉంది. కణంలోకి ప్రవేశించిన వెంటనే వైరస్ ను త్వరగా గుర్తించి పోరాడేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona third wave