సముద్రంలోని సీసాలో సందేశం... స్నేహితులుగా మారిన చిన్నారులు... వైరల్ వీడియో...

సముద్రంలోని సీసాలో సందేశం... స్నేహితులుగా మారిన చిన్నారులు... వైరల్ వీడియో...

సముద్రంలోని సీసాలో సందేశం... స్నేహితులుగా మారిన చిన్నారులు... (Image Credits: Unsplash/ YouTube)

ఓ సీసాలో సందేశం వాళ్ల మధ్య స్నేహాన్ని చిగురింపజేస్తుందని ఎవరూ అనుకోలేదు. అసలీ సంఘటన మొత్తం చిత్రంగానే జరిగింది. ఆ సీసాలో ఉన్న సందేశమేంటి?

 • Share this:
   

  సీసాలో సందేశం అనేది... ప్రపంచ యుద్ధాల కాలంలో ఫేమస్. తమ నౌక మునిగిపోతుంది అనుకునే సమయంలో... నావికులు... సైనికులు... తమ సందేశాన్ని పేపర్లలో రాసి... మడతపెట్టి సీసాల్లో ఉంచి... సీసా మూతలను గట్టిగా బిగింది... ఆ సీసాలను సముద్రంలో విసిరేసేవాళ్లు. అవి సముద్రం ఒడ్డుకు వెళ్లడం ద్వారా... ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసేది. ఇప్పుడు ఈ కథలో... 11 ఏళ్ల వయసున్న సోఫియా , సారా బెత్... అమెరికాలో ఉంటున్నారు. వాళ్లిద్దరికీ ఏ సంబంధమూ లేదు. న్యూయార్క్‌కి చెందిన సోఫియా... సెలవుల్లో ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్‌డేల్‌కి వెళ్లింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా వ్యాపించింది. దాంతో ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఓ పేపర్‌లో రాసి... సిసాలో ఉంచి... సముద్రంలో వదిలేసింది.

  సీసాలోని పేపర్‌లో ఏం రాసిందంటే... తనకు కరోనా అస్సలు నచ్చలేదనీ... స్కూల్లో ఫ్రెండ్స్‌ని మిస్సవుతున్నాననీ తెలిపింది. ఆ సీసాకు రిప్లై వస్తుందని ఆమె ఆశించలేదు.

  ఆ బాటిల్... 1000 కిలోమీటర్లకు పైగా దూరానికి ప్రయాణించింది. చివరకు ఉత్తర కరోలినాలోని హాల్డెన్ బీచ్‌కి చేరింది. అక్కడ ఆ బాటిల్... సారా బెత్‌కి కనిపించింది. అదేదో చెత్త అయి ఉంటుందని ఆ పాప అనుకుంది. తీరా బాటిల్ తెరిచి... పేపర్‌లో సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సినిమాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటిది నాకే ఇలా జరగడం నమ్మలేకపోతున్నా అని తెలిపింది.

  తను ఎక్కడున్నదీ ఆ పేపర్‌లో సోఫియా చెప్పడంతో... సారాబెత్... ఆమతో మాట్లాడింది. కరోనా తగ్గిపోతుందనీ... బోర్‌గా ఫీల్ అవ్వొద్దని ధైర్యం చెప్పింది. అలా సోఫియా, సారాబెత్ ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ల ఫ్యామిలీలు కూడా జరిగిన దానికి ఆనందం వ్యక్తం చేశారు. కరోనా తగ్గగానే... ఇద్దరూ కలవాలని అనుకుంటున్నారు.

  ఈ రోజుల్లో సోషల్ మీడియా, మొబైల్స్ అన్నీ ఉన్నా... సోఫియా... ఇలా సీసాలో సందేశం పంపడం, దానికి అటు నుంచి రిప్లై రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
  First published: