Amit Shah: అమిత్ షాకు కరోనా వ్యాక్సిన్

Amit Shah: అమిత్ షాకు కరోనా వ్యాక్సిన్

అమిత్ షా (ఫైల్)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనకు కరోనా టీకా వేసినట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు ఉదయమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

  • Share this:
    కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనకు కరోనా టీకా వేసినట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు ఉదయమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సిన్ వేయించుకోగా, అమిత్ షా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ మీద దేశ ప్రజల్లో భయం, ఆందోళనలు ఉన్నాయి. దీన్ని తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా టీకాలు వేయించుకున్నారు. దీని ద్వారా ప్రజల్లో భయం పొగొట్టే ప్రయత్నం చేశారు. తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోలను ప్రధానమంత్రి నరంద్ర మోదీ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అయితే, అమిత్ షాకు మేదాంత ఆస్పత్రి వైద్యులు కరోనా టీకా వేసినట్టు హోంశాఖ అధికారులు ప్రకటించారు.

    గత ఏడాది ఆగస్టులో అమిత్ షా కరోనా వైరస్ బారిన పడ్డారు. 56 సంవత్సరాల అమిత్ షా ఆరోగ్యం గురించి అప్పట్లో చాలా వదంతులు వచ్చాయి. అయితే, మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కొన్నాళ్లు ఢిల్లీ ఎయిమ్స్ లో కూడా ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా కోలుకుని విధులకు హాజరయ్యారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు.

    దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో మొదటా భారత ప్రధాని నరేంద్ర మోదీ టీకా తీసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వయసు 70 ఏళ్లు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేస్తుండడంతో ఆయన కూడా టీకా తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి పుదుచ్చేరికి చెందిన నర్సు పి. నివేద వ్యాక్సిన్ షాట్ వేశారు. ఆమెతో పాటు కేరళకు చెందిన మరో నర్సు రోసమ్మ అనిల్ సాయం చేశారు.

    ''భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోస్‌ను ప్రధాని మోదీకి వేశాం. 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తాం. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారని మమల్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక.. అప్పుడే అయిపోయిందా..అస్సలు తెలియలేదని ప్రధాని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.'' అని ప్రధానికి టీకా వేసిన నర్సు పి. నివేద పేర్కొన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు