సిబ్బంది నిర్లక్ష్యం.. తారుమారైన కరోనా రోగి మృతదేహాలు.. రెండ్రోజుల తర్వాత..

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కపూర్బావాడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: July 8, 2020, 2:13 PM IST
సిబ్బంది నిర్లక్ష్యం.. తారుమారైన కరోనా రోగి మృతదేహాలు.. రెండ్రోజుల తర్వాత..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. మహమ్మారి పుణ్యమంటూ పక్కవారిని మందలించే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. మరింత భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్ సోకి చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి బదులుగా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేరొకరి మృతదేహం ఇచ్చారు. తెలియకుండా తమ వ్యక్తి మృతదేహాం అనుకుని అంత్యక్రియలు సైతం పూర్తి చేశారు. రెండ్రోజుల తర్వాత అసలు విషయంలో వెలుగులోకి రావడంతో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి(72)కి కరోనా వైస్ సోకడంతో జూన్ 29న గ్లోబల్ హబ్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి అదృశ్యం అయ్యాడు.

దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కపూర్బావాడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి మృతదేహాన్ని రెండు రోజుల క్రితం వేరే వ్యక్తిని చికిత్స కోసం తీసుకొచ్చిన కోప్రిలోని ఓ కుటుంబానికి ఆస్పత్రి సిబ్బంది అప్పగించారు.

దీంతో వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాధితుల రిపోర్టులు తారుమారు కావడంతో ఈ గందరగోళం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 8, 2020, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading