హాంగ్‌కాంగ్ మోడలే శరణ్యమా...కరోనాను వాళ్లు ఎలా కంట్రోల్ చేశారంటే...

హాంగ్ కాంగ్ లో జనవరి 23న తొలి కరోనా కేసు నమోదైంది. మొత్తం ఇప్పటి వరకూ కేవలం 1038 కేసులు నమోదవ్వగా నలుగురు మాత్రమే మరణించారు.

news18-telugu
Updated: April 30, 2020, 5:24 PM IST
హాంగ్‌కాంగ్ మోడలే శరణ్యమా...కరోనాను వాళ్లు ఎలా కంట్రోల్ చేశారంటే...
(credit - twitter - cp24))
  • Share this:
చైనాలో అంతర్భాగమైనప్పటికీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో హాంగ్ కాంగ్ పైచేయి సాధించి యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. దీంతో ప్రస్తుతం హాంకాంగ్ మోడల్ పై ప్రపంచ దేశాల ఆసక్తి చూపిస్తున్నాయి. గడిచిన నెలరోజులకు పైగా భారత్‌ కూడా లాక్ డౌన్ అమలు చేసింది. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌ను ఎలా సడలించాలా అన్న సందిగ్ధంలో పడింది. దీంతో కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన హాంకాంగ్‌ మోడల్‌పై అందరి దృష్టి పడింది. హాంగ్ కాంగ్ లో జనవరి 23న తొలి కరోనా కేసు నమోదైంది. మొత్తం ఇప్పటి వరకూ కేవలం 1038 కేసులు నమోదవ్వగా నలుగురు మాత్రమే మరణించారు. దాదాపు 75 లక్షల జనాభా కలిగిన హాంకాంగ్‌ లాక్‌డౌన్ అమలు చేయకుండానే కరోనాపై విజయం సాధించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు హాంకాంగ్‌ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసుకుంది. ముందు నుంచీ కొవిడ్‌-19 బాధితుల్ని వెతికి పట్టుకుంది. అందరికీ టెస్టులు చేసి మరీ వారిని క్వారంటైన్ లో పెట్టింది. లాక్ డౌన్ వేళ హాంకాంగ్ కఠినచర్యలు అమలుచేసింది. ఎక్కువ మంది గుమిగూడితే భారీగా జరిమానాలు విధించింది. ఫిబ్రవరిలోనే మెయిన్ ల్యాండ్ చైనాతో సరిహద్దులు మూసేసింది. విదేశీయులకు 14 రోజుల క్వారంటైన్‌ అమలు చేసింది. పాఠశాలలు మూసేసింది. ప్రజా రవాణా బంద్‌ చేసింది. బయట ఎక్కువ మంది తిరగకుండా ఆంక్షలు అమలు చేసింది.

దీంతో మార్చి 31కి అక్కడ కేవలం 715 కేసులు నమోదయ్యాయి. సార్స్ వైరస్ వంటి మహమ్మారిల నుంచి రక్షించుకునేందుకు గత అనుభవం నేపథ్యంలో పౌరులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారు. మార్చి మొదటి వారం నుంచే గుంపులుగా చేరడం మానేశారు. పౌరులంతా మాస్క్‌లు ధరించాలని ముమ్మరంగా ప్రచారం చేసింది. ఈ సలహాను ప్రజలు పాటించారు. ఈ విధానాలే హాంకాంగ్‌ను కరోనా నుంచి బయటపడింది.
First published: April 30, 2020, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading