Home /News /coronavirus-latest-news /

HONG KONG ADMINISTRATION PLANS TO CULL HAMSTERS OVER COVID FEARS PVN

Hamsters : కరోనా భయంతో చిట్టెలుకలని చంపాలని నిర్ణయించిన ప్రభుత్వం..జంతు ప్రేమికుల ఆగ్రహం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hong Kong Plans To Cull Hamsters : గత రెండేళ్లుగా జీరో కోవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తున్న హాంకాంగ్ తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. సుమారు 2,000 చిట్టెలుకలను మరియు ఇతర చిన్న జంతువులను చంపేయాలని మంగళవారం హాంకాంగ్ నిర్ణయించింది. మంగళవారం హాంకాంగ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై... జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆన్ లైన్ పిటిషన్లు వెల్తువెత్తుతున్నాయి.

ఇంకా చదవండి ...
Hamsters To Cull : కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు హాంకాంగ్ ప్రభుత్వం మొదటినుంచి అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జీరో కోవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తున్న హాంకాంగ్ తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. సుమారు 2,000 చిట్టెలుకలను మరియు ఇతర చిన్న జంతువులను చంపేయాలని మంగళవారం హాంకాంగ్ నిర్ణయించింది. మంగళవారం హాంకాంగ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై... పెంపుడు జంతు ప్రేమికులు,జంతువుల యజమానులు మరియు జంతువుల హక్కుల న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ అనేక ఆన్ లైన్ పిటిషన్లు కూడా వెల్తువెత్తుతున్నాయి. జంతువులను చంపవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ అతిపెద్ద ఆన్‌లైన్ పిటిషన్‌పై 20వేల మందికి పైగా సంతకాలు చేశారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే

హాంకాంగ్ లోని టిల్ బాస్ పెట్ స్టోర్ (పెంపుడు జంతువుల దుకాణం)లో పనిచేసే 23 ఏళ్ల ఉద్యోగి మరియు అనేక ఎలుకలు కరోనా వైరస్ బారిన పడినట్లు సోమవారం తేలింది. మంగళవారం టిల్ బాస్ పెట్ స్టోర్‌ ను సందర్శించిన అధికార బృందం..అందులో పనిచేసే 23 ఏళ్ల ఉద్యోగికి సోమవారం కోవిడ్ డెల్టా వేరియంట్‌ సోకినట్లు తెలిపింది.. స్టోర్‌ని సందర్శించి, ఆ ఉద్యోగితో ఇంటరాక్ట్ అయిన ఒక కస్టమర్ కి కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలిపింది. పెట్ స్టోర్ లోని 11 చిట్టెలుకలు కూడా కోవిడ్‌ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో జంతువుల నుండి మనుషులకి వైరస్ సంక్రమించే అవకాశం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా, జంతువుల నుండి మానవులకు వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని,కానీ అది తక్కువేనని అంతర్జాతీయ ఆరోగ్య అధికారులు చెప్పారు,

ALSO READ  Covid Vaccine Fourth Dose : ఒమిక్రాన్ పై నాల్గవ డోసు టీకా ప్రభావం ఎంతంటే..ఇజ్రాయెల్ స్టడీలో ఆసక్తికర విషయాలు

అయితే ఇతర జాతుల చిన్న జంతువులను ఉంచే ఆ పెట్ స్టోర్ మొక్క గోడౌన్(Warehouse)లో తీసుకున్న పర్యావరణ నమూనాల్లో(Environmental Samples)కూడా కరోనా వైరస్ జాడలు కనిపించినట్లుఅధికారులు తెలిపారు. ఈపెట్ స్టోర్‌లోని చిట్టెలుకలు గతేడాది డిసెంబర్ -22 నుంచి ఈ ఏడాది జనవరి-7 మధ్యన రెండు బ్యాచ్ లలో నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేయబడ్డాయని తెలిపారు.
మంగళవారం అధికారులు పెట్ స్టోర్ లోని చిట్టెలుకలు, కుందేళ్లు సహా అన్ని చిన్న జంతువులను పరీక్షించి..ప్రజలకు ఆరోగ్యానికి హాని అని పేర్కొంటూ టెస్ట్ ఫలితంలో సంబంధం లేకుండా వాటన్నింటినీ చంపేసేందుకు ఏర్పాట్లు చేశారు. నొప్పి కలిగించకుండా వాటిని చంపాలని నిర్ణయించారు.

మంగళవారం రాత్రి బయటికొచ్చిన కొన్ని ఫోటోల్లో...హజ్మత్ సూట్‌(ప్రమాదకర పదార్థాల నుంచి రక్షించే సూట్)ధరించిన కోవిడ్ కంట్రోల్ వర్కర్లు అనేక పెంపుడు జంతువుల దుకాణాల ప్రాంగణాన్ని డిస్ ఇన్ఫెక్ట్ చేయడం మరియు ఎర్రటి ప్లాస్టిక్ సంచులను బయటకు తీసుకురావడం కనిపిస్తోంది. ఆ ప్లాస్టిక్ సంచులలోనే చిట్టెలుకలు,ఇతర చిన్న జంతువులు ఉన్నట్లు తెలుస్తోంది. స్టోర్ నుండి తీసుకెళ్లిన అన్ని జంతువుల పట్ల "మానవత్వం"గా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు.

ALSO READ  gene variant: కొవిడ్ నుంచి రక్షించే కీలక జన్యువును గుర్తించిన సైంటిస్టులు

ఇక,హాంకాంగ్  నగరంలోని అన్ని పెంపుడు జంతువుల దుకాణాలు(Pet Stores)తమ వద్దనున్న చిట్టెలుకలని చంపేసేందుకు అప్పగించాలని హాంకాంగ్ ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 22 నుండి ప్రారంభమయ్యే క్రిస్మస్ సందర్భంగా చిట్టెలుకను కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

అదేవిధంగా,హాంకాంగ్ లోకి అన్ని చిన్న జంతువుల దిగుమతిని కూడా అధికారులు నిలిపివేశారు. దీంతోపాటు చిట్టెలుకలను విక్రయించే అన్ని పెంపుడు జంతువుల దుకాణాలకు వారి చిన్న జంతువులన్నీ కోవిడ్ టెస్ట్ లో నెగిటివ్ గా తేలే వరకూ స్టోర్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. తమ పెంపుడు జంతువులతో "మంచి పరిశుభ్రత పద్ధతులను అవలంబించాలని", వాటిని ముద్దు పెట్టుకోవడం వంటివి మానుకోవాలని స్థానిక ప్రజలను అధికారులు మంగళవారం కోరారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Animals corona, Coronavirus, Hong kong

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు