క్వారంటైన్‌లో కుటుంబం.. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేక..

ఇంటికి వచ్చిన కొడుకుకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ సహకరించలేదు. కనీసం వాహనంలో ఎక్కించేందుకు స్థానికులెవరూ ముందుకు రాలేదు.

news18-telugu
Updated: July 4, 2020, 9:23 AM IST
క్వారంటైన్‌లో కుటుంబం.. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కుటుంబ యజమాని చనిపోయాడు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో భార్య ఐసోలేషన్‌లో ఉండగా, కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నారు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు క్వారంటైన్‌లో ఉన్న కొడుకు, కోడలు వచ్చి ఒంటరిగా అంత్యక్రియలు చేసిన విషాద ఉదంతమిది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆమె కొడుకులు, కోడళ్లను క్వారంటైన్‌కు తరలించారు. అప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న ఆ మహిళ భర్త ఒంటరిగా ఇంటిలోనే ఉండిపోయాడు.

ఈనెల 2వ తేదీన మధ్యాహ్నాం సమయంలో అతడు చనిపోయాడు. ఇంటి యజమాని చనిపోయిన విషయం క్వారంటైన్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ తెలియదు. ఇరుగుపొరుగు స్థానిక నాయకులకు సమాచారం అందజేశారు. దాంతో నాయకులు పోలీసులు, మున్సిపల్ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదు. 24 గంటలు గడిచినా కుటుంబ సభ్యులు రాలేదు. దీంతో స్థానికులు అధికారులను నిలదీయడంతో క్వారంటైన్‌లో ఉన్న కొడుకు, కోడలికి విషయం చెప్పారు. ఒక్క రోజు వచ్చిపోయేందుకు అవకాశం కల్పించారు.

అయితే ఇంటికి వచ్చిన కొడుకుకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ సహకరించలేదు. కనీసం వాహనంలో ఎక్కించేందుకు స్థానికులెవరూ ముందుకు రాలేదు. చేసేదేంలేక కొడుకు మహాప్రస్థానం వాహనం రప్పించి డ్రైవర్ సహకారంతో కొడుకు, కోడలు వాహనంలోకి మృతదేహాన్ని ఎక్కించారు. ఇంతలో కరోనా పరీక్షలు చేయకుండా అంత్యక్రియలు నిర్వహించొద్దంటూ మున్సిపల్ అధికారులు అడ్డగించారు.

కరోనా నిర్ధారణ పరీక్షల కోసమని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే అక్కడ వాహనాన్ని లోపలికి అనుమతించలేదు. దాంతో మృతదేహాన్ని తిరిగి తాడేపల్లికి తీసుకొచ్చి స్థానికుల సహకారంతో దహనం చేశారు. కరోనా మహమ్మారి పుణ్యమంటూ కట్టుకున్న భర్త మృతదేహాన్ని కడసారి చూసేందుకు భార్యకు అవకాశం దక్కకుండా పోయింది.
Published by: Narsimha Badhini
First published: July 4, 2020, 9:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading