HOLIDAYS FOR EDUCATIONAL INSTITUTIONS IN HIMACHAL PRADESH TILL JANUARY 26 SNR
హిమాచల్‌ప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు..అప్పటి వరకూ విద్యార్ధులు ఇళ్లలో ఉండాల్సిందేనా..
ప్రతీకాత్మక చిత్రం
Himachal Pradesh: మళ్లీ కథ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. కరోనా ఆంక్షలు, కర్ఫ్యూలు, విద్యాసంస్థలకు సెలవులు...చివరకు లాక్డౌన్ విధించే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కరోనా కేసులకు భయపడి జనవరి 26వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
కొద్ది రోజులు విరామం తీసుకున్న కరోనా వైరస్ (Coronavirus) అంతకు మించిన రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. ప్రపంచ దేశాల్లోనే కాదు..భారత్(India)లో దాని ప్రభావంతో చాలా రాష్ట్రాలు తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్(Himachal pradesh)లో పాజిటివ్ కేసులు పెరగుతుండటంతో అక్కడి ప్రభుత్వం వెంటనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్నీ విద్యాసంస్థల (Educational institutions)కు సెలవులు (Holidays)ప్రకటించింది. శనివారం నుంచి గణతంత్ర దినోత్సవం(Republic day)వరకు అంటే జనవరి 26వ తేది వరకు స్కూళ్లు (Schools)కాలేజీలు( College) ,యూనివర్సిటీలు (University), మెడికల్ కాలేజీలు(Medical college), ఇంజనీరింగ్ (Engineering colleges), పాలిటెక్నిక్ కాలేజీలు ఏ ఒక్కటి తెరవడానికి వీల్లేదని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక గవర్నమెంట్ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను సైతం మూసివేయాలని ఆదేశించింది. నర్సింగ్, మెడికల్ కాలేజీలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది ప్రభుత్వం. జనవరి 26 తర్వాత పూర్తి కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్న తర్వాతే కార్యకలాపాలు కొనసాగించాలని సూచించింది.
థర్డ్‌వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది..
గడిచిన 24గంటల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో కేసులు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అయినప్పటికి..స్థానికంగా కేసుల తీవ్రత పెరగడంతో ముందస్తు జాగ్రత్తగా ఈనిర్ణయం తీసుకుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఇలాంటి కారణాల్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం విద్యాసంస్థలు, యూనివర్సిటీలు మూసివేయాలని ఆదేశించింది. ఇప్పటికే శుక్రవారం 574 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన వాళ్లలో ఒకరు మృతి చెందారు.
#Omicron: All educational institutes to remain closed in Himachal Pradesh till January 26, as per State Govt order
హిమాచల్‌ప్రదేశ్‌లో విద్యాసంస్థలు బంద్..
హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది ప్రభుత్వం. సినిమా హాళ్లు, స్పోర్ట్స్ స్టేడియంలకు కేవలం 50శాతం ఆక్యుపెన్సితోనే తమ కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించింది. అటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించే ఫంక్షన్ హాల్స్‌లో కూడా 50శాతం మందికి మాత్రమే అనుమతి ఇస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో జనవరి 5వ తేది నుంచి రోజుకు వందకుపైగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాష్ట్రంలో ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వం ఆదేశాలను ఎవరైనా అతిక్రమించినా..విద్యాసంస్థలు తెరిచినా వారిపై సెక్షన్51-60 డిజాస్టర్ మెనేజ్మెంట్ యాక్ట్ 2005కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.