టెస్టులు ఎందుకు తగ్గాయి.. ఆక్సిజన్ బెడ్ల సంగతేంటి.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

Telangana News: మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర టెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తెలంగాణలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 24, 2020, 3:53 PM IST
టెస్టులు ఎందుకు తగ్గాయి.. ఆక్సిజన్ బెడ్ల సంగతేంటి.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కరోనా టెస్టులు ఎందుకు తగ్గించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనాపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర టెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తెలంగాణలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో చెప్పాలని ప్రశ్నించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని హైకోర్టు ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాల కంటే ఎందుకు వెనుకబడి ఉన్నారో వివరణ ఇవ్వాలని కోరింది.

Covid 19 104 call centre, corona virus 104 call centre, telangana 104 call centre, telangana news, corona virus, telangana news, కోవిడ్ 19 కాల్ సెంటర్, కరోనా వైరస్ 104, తెలంగాణ న్యూస్, కరోనా వైరస్, తెలంగాణ న్యూస్
తెలంగాణ హైకోర్టు (పైల్ ఫోటో)


వెయ్యిమందికి కనీసం 3 బెడ్లు లేకపోవడానికి కారణలేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తండ్రి కరోనాతో చనిపోయిన కారణంగా నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరిన ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

గతంలోనే తెలంగాణ పరీక్షలు, ప్రైవేటు ఆస్పత్రల్లో వసూలు చేస్తున్న బిల్లులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఏకంగా సీఎస్ సోమేశ్ కుమార్ విచారణకు హాజరై కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే వైరస్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తాజాగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Corona virus, covid 19 telangana, Mask violaters, physical distance violaters, telangana news, కరోనా వైరస్, కోవిడ్ 19 తెలంగాణ, మాస్క్ ధరించని వాళ్లు, భౌతిక దూరం పాటించని వాళ్లు, తెలంగాణ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం


ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో 8 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఇప్పటి వరకు 1070 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 2,004 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1,,48,139 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 23,929 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో రికవరీల సంఖ్య భారీగా పెరిగాయి. దేశ రికవరీ రేటు 81.42గా ఉండగా.. తెలంగాణ రికవరీ రేటు 82.64గా ఉంటుంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 గా ఉంటే.. దేశంలో 1.59గా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కొత్తగా 308, రంగారెడ్డిలో 168, కరీంనగర్‌లో 120, మేడ్చల్‌లో 151, నల్గొండలో 136, సిద్దిపేటలో 95, వరంగల్ అర్బన్‌లో 77, ఖమ్మంలో 86 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 55,318 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 26,84,215 మందికి కరోనా పరీక్షలు చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: September 24, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading