Home /News /coronavirus-latest-news /

Viral Video: హైటెక్ కొబ్బరి బోండం బండి.. తాకకుండానే నీళ్లు.. కరోనా వేళ ఖతర్నాక్ ఐడియా

Viral Video: హైటెక్ కొబ్బరి బోండం బండి.. తాకకుండానే నీళ్లు.. కరోనా వేళ ఖతర్నాక్ ఐడియా

కొబ్బరి నీళ్లను తీసే యంత్రం

కొబ్బరి నీళ్లను తీసే యంత్రం

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఇప్పటికే 43 మిలియన్ల వీక్షణలు అందుకుంది. సంప్రదాయానికి విరుద్ధంగా ఆధునిక పద్ధతిలో స్వచ్ఛతను పాటిస్తూ కొబ్బరి నీళ్లను సేకరించడం పట్ల నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. శరీరానికి తగిన పోషకాలు అందించడమే కాకుండా వేడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా అలసిపోతే ఉత్ప్రెకంగా పనిచేస్తాయి. శరీరాన్ని రీఫ్రెష్ చేసే కొబ్బరినీళ్లు వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృభిస్తోన్న తరుణంలో బాటిళ్లు, పాకెట్స్ లో వీటిని తీసుకెళ్లడం అంత సురక్షితం కాదు. వైరస్ వ్యాపించే ప్రమాదముంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి ఎలాంటి టచ్ లేకుండానే తాజా కొబ్బరి నీళ్లను విక్రయిస్తున్నాడు.

మిషన్ సహాయంతో కొబ్బరినీళ్ల సేకరణ..
ఇండోర్ కు చెందిన అర్జున్ సోనీ కొబ్బరి బొండాలను అమ్ముతుంటాడు. హైజీనిక్ గా ఉండేందుకు గాను అధునాతన పరికరాలను ఉపయోగించి మిషన్ ను తయారు చేశాడు. ఈ మిషన్ ను బండికి అమర్చి దాని సహాయంతో కొబ్బరి కాయలో నీటిని ఏ మాత్రం తాకకుండా నీటిని సేకరిస్తున్నాడు. స్వచ్ఛతను పాటిస్తూ ప్యాకింగ్ చేసి వాటిని విక్రయిస్తున్నాడు. కొబ్బరి కాయను కత్తితో కట్ చేయకుండా అధునాతన పరికరాలను ఉపయోగించి నీటిని పరిశుభ్రమైన ప్లాస్టిక్ గ్లాసులో సేకరించాడు. అంతేకాకుండా నీటిని వడకట్టడానికి ఫిల్టర్ ను కూడా వాడాడు.
ఎంతో పరిశుభ్రమైన రీతిలో సేకరిస్తున్న ఈ కొబ్బరి నీళ్ల గ్లాసు ఖరీదు వచ్చేసి రూ.50లు మాత్రమే. కొబ్బరి బోండంలో ఉండే కొబ్బరిని కూడా గరిటతో తీసి కస్టమర్లకు అందిస్తున్నాడు. ఇంత తక్కువ ధరలో అత్యంత స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లను అందిస్తోన్న అర్జున్ ను అందరూ పొగుడుతున్నారు.

నెటిజన్ల విశేష స్పందన..
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఇప్పటికే 43 మిలియన్ల వీక్షణలు అందుకుంది. సంప్రదాయానికి విరుద్ధంగా ఆధునిక పద్ధతిలో స్వచ్ఛతను పాటిస్తూ కొబ్బరి నీళ్లను సేకరించడం పట్ల నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అర్జున్ సోనీ పనితీరును అభినందిస్తున్నారు. "ప్రత్యేకమైన మరియు పరిశుభ్రమైన" బండిగా పిలుస్తున్నారు. శరీరాన్ని చల్లగా చేసే అద్భుతమైన మార్గం అని ఇంకోకరు పోస్ట్ చేశారు. పరిశుభ్రమైన కొబ్బరినీళ్లకు మంచి ఆప్షన్ అని మెచ్చుకుంటున్నారు. అయితే కొంతమంది అతడు ప్లాస్టిక్ గాజును వాడటాన్ని తప్పుబట్టారు. "పర్యవరణానికి దెబ్బ" అని కామెంట్ చేశారు. కొబ్బరి చిప్ప నుంచి డైరెక్టుగా నీటిని తాగాలని అనుకుంటున్నానని మరోకరు స్పందించారు. ప్రస్తుతం కోవిడ్ విజృభిస్తున్న తరుణంలో అర్జున్ సోని ప్రయత్నం నలుదిశలా వ్యాపిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Coconut water, Coronavirus, Covid-19, Health

తదుపరి వార్తలు