Home /News /coronavirus-latest-news /

HEROIN TRISHA INTERESTING COMMENTS ON CORONAVIRUS TA

కరోనా వైరస్ పై హీరోయిన్ త్రిష వేదాంతం..

నిశ్చితార్థం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరస అవకాశాలతో దూసుకుపోయింది. ఈ మధ్య కూడా 96 లాంటి సంచలన సినిమాలు చేసింది త్రిష.

నిశ్చితార్థం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరస అవకాశాలతో దూసుకుపోయింది. ఈ మధ్య కూడా 96 లాంటి సంచలన సినిమాలు చేసింది త్రిష.

ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయ భ్రాంతులకు గురి చేస్తోంది కరోనా. ఈ వైరస్ పై త్రిష తనదైన వేదాంత ధోరణిలో ఒక వీడియోను విడుదల చేసింది.

    ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయ భ్రాంతులకు గురి చేస్తోంది కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ప్రపంచం ఆర్ధిక మాంద్యంలోకి జారుకుంది. ఈ వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ సందర్భంగా పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారితో పాటు.. నిరుపేదలను ఆదుకునేందుకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా హీరోయిన్‌ కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి హీరోయిన్ త్రిష పలు సూచనలు చేసారు. ఈ విషయమై ఆమె ఓ వీడియో విడుదల చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అందరు ఇంట్లోనే ఉండాలని కోరారు. కరోనాకు ప్రాంతం, భాష, మతం, వయసు, బీదా, గొప్ప, ఆడా, మగా అనే తేడాలు తెలియవన్నారు. ఎవరికైనా కరోనా సోకుతుందని చెప్పుకొచ్చింది. అందువల్ల అందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయినప్పటికీ మనల్ని, మన సమాజాన్ని కాపాడుకునేందుకు కొన్నిరోజులు అందరు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ వైరస్‌ను దేశ ప్రజలందరు ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఎదుర్కోని ఈ మహామ్మారిని తరిమికొట్టాలన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Coronavirus, Covid-19, Kollywood, Tollywood, Trisha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు