సీఎం కేసీఆర్‌ను కలిసిన నితిన్.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ 10 లక్షల విరాళం..

సీఎం కేసీఆర్‌కు రూ.10 లక్షల చెక్ అందజేసిన నితిన్ (Twitter/Photo)

హీరో నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసారు. అంతేకాదు కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేస్తోన్న కృషిని అభినందిస్తూ.. తన వంతు సాయంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు.

 • Share this:
  హీరో నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసారు. అంతేకాదు కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేస్తోన్న కృషిని అభినందిస్తూ.. తన వంతు సాయంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్‌ను కలిసి ఆయనకు చెక్‌ను అందజేసాడు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలైవుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి మరో రూ.10 లక్షలను విరాళంగా అందజేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే దక్షిణ భారత దేశానికి చెందిన నటీనటులను ఆదుకోవడానికి రజినీకాంత్, సూర్య, విజయ్ సేతుపతి రూ 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ప్రకాష్ రాజ్, రాజశేఖర్ వంటి నటులు కూడా కరోనా వైరస్ సందర్భంగా బీద కళాకారులకు, తమ దగ్గర పనిచేసేవాళ్లకు తగినంత సాయం చేసారు.

  hero nithiin met telangana cm kcr and donate 10 lakhs check to cm releaf fund,Nithiin,coronaviurs,coronavirus,covid 19,nithiin donates 20 lack rupees to telangana and ap goverments,nithiin donates 20 lakhs,nithiin 10 lakhs to telangana government,nithiin donates 10 lakhs to andhra pradesh government,tollywood,telugu cinema,నితిన్,నితిన్ రూ 20 లక్షల విరాళం,నితిన్ రూ 10 లక్షల విరాళం,తెలంగాణ ప్రభుత్వానికి నితిన్ విరాళం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ 10 లక్షల విరాళం,కోవిడ్ 19,కరోనా వ్యాధి నివారణకు నితిన్ రూ 20 లక్షల విరాళం
  సీఎం కేసీఆర్‌తో నితిన్ (Twitter/Photo)


  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  మన దేశంలోని అన్నిరాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. రైళ్లు, బస్సులు, విమానాలు  ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు బీదా, గొప్ప, ఆడా, మగా తేడా లేకుండా అందరు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. అందులో సినిమా పరిశ్రమ కూడా ఉంది. కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే . ఇప్పటికే దేశ వ్యాప్తంగా థియేటర్స్ అన్నింటినీ మూసేసారు. అంతేకాదు అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్  ఆగిపోయాయి. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి నితిన్ సాయం అందించారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: