కరోనా వ్యాధి నివారణకు నితిన్ రూ 20 లక్షల విరాళం..

హీరో నితిన్ పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా పై పోరాటానికి తన వంతు సాయంగా రూ.20లక్షలు విరాళంగా ప్రకటించాడు.

news18-telugu
Updated: March 23, 2020, 8:03 PM IST
కరోనా వ్యాధి నివారణకు నితిన్ రూ 20 లక్షల విరాళం..
నితిన్ (Nithiin)
  • Share this:
హీరో నితిన్ పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా పై పోరాటానికి తన వంతు సాయంగా రూ.20లక్షలు విరాళంగా ప్రకటించాడు. ఈ వైరస్ కారణంగా బీదా, గొప్ప, ఆడ, మగా తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. ఐతే.. కరోనాపై పోరాటానికి అందరూ చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ బారిన పడకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. తాజగా హీరో నితిన్.. కరోనా పై పోరాటానికి తన వంతు సాయంగా రూ.20 లక్షలు విరాళంగా ప్రకటించాడు. కరోనా వైరస్ పరికరాల కోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వానికి చెరో రూ.10 లక్షలు విరాళం ప్రకటించాడు. ఎలాగైతే వరదలు, ఉత్పాతాలు సంభవిస్తే.. సెలబ్రిటీలు ఎలాగైతే ప్రభుత్వాలకు బాసటగా నిలిస్తారో.. తాజాగా  ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను పారద్రోలడానికి అందరు ముందుకు రావాలని నితిన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చినట్టైయింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్నో లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇలాంటి సమయంలో కాస్త ధనవంతులు ప్రభుత్వాలకు చేతనైన సహాయం చేయాలి. ఇప్పటికే ఆనంద్ మహీంద్ర, రతన్ టాటా, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల అధిపతులు తమ వంతు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముందు ముందు వేరే సెలబ్రిటీలు కూడా దేశాన్ని కబలిస్టున్న ఈ వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వానికి తమ వంతు సాయం  చేయడానికి ముందుకు రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 23, 2020, 8:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading