Sanjeevani Gaadi : సంజీవని గాఢీలో ఒకరోజు .. సంజీవని గాఢీతో ఒకరోజు...

Sanjeevani Gaadi

హలో, నా పేరు సంజీవని గాఢీ. నేను భారతదేశంలోని వివిధ గ్రామాలకు ప్రయాణిస్తాను. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలను సందర్శించి వివిధ కమ్యూనిటీలకు కొవిడ్-19 గురించి విలువైన సమాచారాన్ని తెలియజేసి, వారిని వైరస్ బారి నుండి కాపాడటమే నా పని.

 • Share this:
  జనవరి 2020లో ప్రపంచం ఇలా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ సరికొత్త మార్పుకు ఎవరూ సిద్ధంగా లేరు. దేశాలు దాటి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రవేశించిన ఈ వైరస్, ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చింది. అదృష్టవశాత్తు, ఈ విషయంలో నేను కొంత సహాయం చేయగలను. నా ప్రస్తుత గమనంలో, దేశంలోని 5 జిల్లాలకు తిరిగి, చాలా ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. గ్రామం నుంచి గ్రామానికి ప్రయాణిస్తున్న క్రమంలో ప్రతిరోజు నేను వందల సంఖ్యలో కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడగలిగాను. నా ప్రయాణంలో భాగంగా నేను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించడంతో విభిన్న రకాల వైవిధ్యతలు గల వ్యక్తులను కలిసే అవకాశం లభించింది. వీరిలో విభిన్న వయస్సులకు, సామాజిక నేపథ్యాలకు, విభిన్న లింగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న పాండమిక్ పరిస్థితుల్లో, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న ఈ తరుణంగా, సంజీవనీ గాఢీగా నేను చేయాల్సిన పని చాలా ప్రాముఖ్యంగా మారింది. ఒక్క చిన్న సంఘటన చూస్తే, నేను ఇండోర్ వెళ్లినప్పుడు, నన్ను వ్యాక్సిన్ గురించి అందరూ చాలా ప్రశ్నలు అడిగారు. వారిలో చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, “మనం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ వస్తుందా?” అని అడిగారు. కొంతమంది “టీకా ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగారు. ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానాలు అందించే సమాచారం కలిగిన లీఫ్‌లెట్స్, సందేశాలు, వాటిని వివరించగల బృందాలతో నేను ఎప్పుడూ సంసిద్ధంగా ఉండేలా చూసుకుంటాను. చిన్న పిల్లలు నన్ను చూసి, వాళ్ల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి నేను వచ్చిన సంగతిని ఇంట్లో వాళ్లకి తెలియజేస్తుంటారు. “గాఢీ వచ్చింది!” అని గోల చేస్తారు. అందరికీ చేరువయ్యేలా, నిరక్షరాస్యత అనే అడ్డంకి లేకుండా నా సందేశాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే సమీకృత విధానాన్ని అమలు చేయడం అవసరం. దీని కోసం, నా ఆడియో-విజువల్ స్క్రీన్ మీద వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కొవిడ్ వ్యాధిగ్రస్తులతో ఎలా ప్రవర్తించాలి లాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన వీడియోలు ప్లే అవుతుంటాయి. ఈ రకంగా, ప్రజలకు అవసరమైనప్పుడు నేను విజువల్ గైడ్‌గా కూడా ఉపయోగపడతాను. కొందరు నా వీడియోలు చూస్తూ రిజిస్టర్ చేసుకుంటుండటాన్ని బట్టి అవగాహన కల్పించడంలో వివిధ రకాల దారులు అమలు చేయడంలో ఉన్న ప్రయోజనాలను తెలియజేస్తోంది. మంచి విషయం ఏంటంటే, ఎంతో మంది కొవిడ్ -19 సహిత ప్రవర్తనావళిని అలవరుచుకున్నారు, తద్వారా, వారి కమ్యూనిటీ సురక్షిత ప్రాంతంగా మారింది.

  వ్యాక్సిన్ తీసుకోవడంలో నిరాసక్తిని పోగొట్టడం కూడా నా పనిలో ఒక భాగం. మూఢనమ్మకాలు, తప్పుడు వార్తల కారణంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. ఇలాంటి వారిని కలవడానికే నేను ఎక్కువ ఆసక్తి చూపుతాను. పైన తెలిపిన ప్రశ్నల ఉదాహరణలతో పాటుగా, కొందరు పూర్తిగా విరుద్ధంగా ఉండే మాటలు కూడా మాట్లాడారు. “వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొందరు చనిపోతున్నారు, మరి నేనెందుకు తీసుకోవాలి?, “ఫారిన్ పదార్థాలు నా శరీరంలోకి ఎక్కించుకోవడం నాకు ఇష్టం లేదు” అంటూ కొందరు విముఖత తెలియజేశారు. వీళ్లంతా కొవిడ్-19 కారణంగా బాగా ప్రభావితమైన వారైనా అయ్యుండాలి లేదంటే ఆధునిక సాంకేతికత మీద నమ్మకం లేని వారైనా అయ్యుండాలి. ఇలాంటి తప్పుడు భావనలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నేను ఎక్కువ సమయం వెచ్చించి, తరాలుగా నమ్ముతున్న వారి మూఢనమ్మకాలను పారద్రోలాలి. తనను తాను కాపాడుకోవడమే కాకుండా చెయిన్ బ్రేక్ చేసి తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడటంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియజేసి, వ్యాక్సిన్ చేయించుకోవడం వెనక ఉన్న సైద్ధాంతిక నిజాలు, ఆధారాలతో వాళ్లను చైతన్యం చేయడంలో నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నా దగ్గర ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని, వ్యాక్సిన్ కోసం రిజిష్టర్ చేసుకున్న వ్యక్తుల గురించి కూడా నేను వారితో మాట్లాడాను.

  Mass awareness drive using the Sanjeevani Gaadi


  అదనంగా, ప్రేరణ పొందిన వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ భావజాలాన్ని అనుసరిస్తూ, నా ప్రతి ప్రయాణంలో, సర్పంచ్, గ్రామ పంచాయతీ లాంటి ప్రభుత్వ అధికారులతో కూడా నేను మాట్లాడాను. ఇలా చేయడం ద్వారా నేను ఎక్కువ మందికి చేరువ కాగలిగి కొవిడ్-19 సహిత ప్రవర్తన, వ్యాక్సిన్ తీసుకోవడం విముఖతను తగ్గించడం లాంటి అంశాల గురించి తెలియజేయగలిగాను. నా గురించి వారు ఎన్నో మంచి విషయాలను కూడా ప్రచారం చేశారు. దీంతో నా గురించి ఇతర గ్రామాల నాయకులకు కూడా తెలిసి, నన్ను వారి గ్రామాలకు ఆహ్వానించడం మొదలుపెట్టారు. రాష్ట్ర సరిహద్దులను దాటే సౌకర్యం ఉంది కాబట్టి, ఎంపిక చేసిన జిల్లాలలో మద్దతు అవసరమైన వారికి సహాయం చేయడంలో నా బృందానికి నేను నేర్చుకున్న అంశాలను పంచుకునే వీలు కలిగింది. లబ్ధిదారులకు కావాల్సిన సహాయం చేస్తూ, వారి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా సంజీవని గాఢీ అనే నేను, మెరుగైన సమాచారాన్ని, ప్రవర్తనను, అలవాట్లను సమాజంలో అలవరచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాను. సంబంధిత సమాచారం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ, ఒక నమ్మశక్యమైన సమాచార గనిగా ఉంటాను. ఇలా ఉండటం వల్ల నేటి వాతావరణంలో కొవిడ్-19 వ్యాప్తి కలిగించే రిస్కును తగ్గించవచ్చు. రానున్న నెలల్లో, 3200000 కంటే ఎక్కువ మందికి చేరువై, వారికి సమాచార ఆధారిత మద్దతును అందిచడమే నా లక్ష్యం.

  ఇండోర్, గుంటూరు, దక్షిణ కన్నడ, నాసిక్, అమృత్‌సర్‌లలోని ఎంపిక చేసిన గ్రామాలకు వెళ్లడానికి - నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

  తారా రఘునాథ్,
          కో-ఆర్డినేటర్, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్,
           యునైటెడ్ వే ముంబై
  Published by:Sridhar Reddy
  First published: