Covid-19 | కరోనా వైరస్‌తో ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే..

Covid-19 : కరోనా.. కరోనా.. కరోనా.. యావత్తు ప్రపంచం ఇదే జపం చేస్తోంది. అన్ని దేశాల వెన్నులో వణుకు పుట్టించిన ఈ మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది.

news18-telugu
Updated: March 26, 2020, 6:58 AM IST
Covid-19 | కరోనా వైరస్‌తో ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రతీకాత్మక చిత్రం. (File)
  • Share this:
కరోనా.. కరోనా.. కరోనా.. యావత్తు ప్రపంచం ఇదే జపం చేస్తోంది. అన్ని దేశాల వెన్నులో వణుకు పుట్టించిన ఈ మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. దాదాపు 19 వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ త్వరలో ఊహించనంత వేగంగా విజృంభించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ వైరస్ బారిన ఎంత మంది పడ్డారు? ఎంత మంది చనిపోయారు? ఎన్ని దేశాలు ప్రభావితం అయ్యాయంటే.. ఇప్పటి వరకు 197 దేశాలను ఆవహించిన ఈ వైరస్ బారిన 4,72,081 మంది బారిన పడ్డారు. అందులో 21,285 మంది మృత్యు ఒడిలోకి చేరారు.
కరోనా బాధితుల వివరాలు (WHO Website)


దేశాల వారీగా చూసుకుంటే ఇప్పటి వరకు చైనాలో అత్యధికంగా 81,869 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇటలీలో 69,176 కేసులు, అమెరికాలో 51,914 కేసులు, స్పెయిన్‌లో 39,673 కేసులు, జర్మనీలో 31,554 కేసులు, ఇరాన్‌లో 27,017 కేసులు ఫ్రాన్స్‌లో 22,025 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో తాజా సమాచారం ప్రకారం 606 కేసులు నమోదయ్యాయి. అందులో.. 553 మంది వైరస్‌తో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు