HERE ARE THE DETAILS ABOUT THE LATEST UPDATE ON NEW CURFEW GUIDELINES IN ANDHRA PRADESH PRN
AP Curfew Update: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే..
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ (Curfew) అమలు చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో కర్ఫ్యూ కఠింనంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. జూన్ నుంచి స్వల్పంగా సడలింపులు ఇస్తోంది. జిల్లాల వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు, పాజిటివిటీ రేటు ఆధారంగా కర్ఫ్యూ సమయాన్ని కుదిస్తూ వస్తోంది. ఇటీవలే 13 జిల్లాలకు ఒకే రకమైన కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలువోతంది. తాజాగా కర్ఫ్యూపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవారం రోజుల పాటు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 21 వరకు కర్ఫ్యూ అమలవుతుందని తెలిపింది. అత్యవసర సేవలు మినహా ఇతర సేవలకు అనమతి లేదని స్పష్టం చేసింది. వ్యాపారసంస్థలు, దుకాణదారులు రాత్రి 9గంటలకే మూసివేయాల్సి ఉంటుంది.
గత రెండు వారాలుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడంతో క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య 2వేల నుంచి 3వేల మధ్యలో నమోదవుతూ వస్తోంది. పాజిటివిటీ రేటు కూడా 3 శాతం కంటే దిగువకు వచ్చింది. ఐతే తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రోజుకు సగటున 300 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. అనంతపురం, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వంద కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి.
రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. ఇక కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన సమయంలో మాస్కు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తోంది ప్రభుత్వం. సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్ లు, షాపింగ్ మాల్స్ లో భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ప్రభుత్వం విడుద చేసిన లేటెస్ట్ హెల్త్ బులిటెన్ లో 90,204 శాంపుల్స్ ని పరీక్షించగా 2,591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 69, చిత్తూరు జిల్లాలో 349, తూర్పుగోదావరి జిల్లాలో 511, గుంటూరు జిల్లాలో 219, కడప జిల్లాలో 217, కృష్ణాజిల్లాలో 190, కర్నూలు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 162, ప్రకాశం జిల్లాలో 251, శ్రీకాకుళం జిల్లాలో 62, విశాఖపట్నం జిల్లాలో 220, విజయనగరం జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 266 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.