గుడ్‌న్యూస్.. హెపటైటిస్-సి మందులతో కరోనా వైరస్‌కు చెక్

ప్రతీకాత్మక చిత్రం

హెపటైటిస్‌-సి చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలవని జర్మీనికి చెందిన జోహెన్నస్ గుటెన్‌బర్గ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

 • Share this:
  యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు ఇప్పటి వరకు మందు లేదు. కరోనా వాక్సీన్‌ను కనిపెట్టేందుకు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా సహా చాలా దేశాల తమ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాలు టీకాలు కనిపెట్టినప్పటికీ అవి ట్రయల్ దశలోనే ఉన్నాయి. ఇక మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్‌తో కరోనాను కట్టడి చేయవచ్చని మొదట భావించారు. ఎన్నో దేశాలు భారత్‌ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను దిగుమతి చేసుకున్నాయి. కానీ ఆ మందు అంతగా ప్రభావం చూపడం లేదని అమెరికా స్పష్టంచేసింది. ఇక ఎబోలా మందు రెమెడిసివివర్‌ బాగా పనిచేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో డ్రగ్ తెరపైకి వచ్చింది.

  హెపటైటిస్‌-సి చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలవని జర్మనీకి చెందిన జోహెన్నస్ గుటెన్‌బర్గ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. సూపర్‌ కంప్యూటర్‌ సిమ్యూలేషన్‌లో విస్తృత గణనలను ఉపయోగించి పరిశోధకులు అధ్యయనం చేశారు. సార్స్‌-కొవిడ్‌2 ప్రొటీన్లను బంధించే 42,000 పదార్థాలను వారు సిమ్యులేట్‌ చేశారు. అత్యంత శక్తిమంతమైన మోగాన్‌-2 సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగించి ఆ పదార్థాలు కరోనా పునరుత్పత్తిని అడ్డుకుంటున్నాయో లేదో పరీక్షించారు. ఇందుకోసం రెండు నెలల్లోనే 3000 కోట్ల గణనలు చేపట్టారు శాస్త్రవేత్తలు.

  విస్తృత పరిశోధనల అనంతరం.. హెపటైటిస్‌-సికి ఉపయోగించే సిమిప్రివిర్‌(simeprevir), పరిటప్రివిర్‌ (paritaprevir), గ్రాజోప్రివిర్‌ (grazoprevir), వెల్పటస్విర్‌ (velpatasvir) ఔషధాలు కరోనాను అడ్డుకుందనేందుకు పనిచేస్తున్నాయని వెల్లడించారు. కొవిడ్-19, హెపటైటిస్‌-సిలో ఉండే వైరస్‌ ఒకే జాతికి చెందినదేనని.. అది ఏకపోగు RNA వైరస్ అని JGU ప్రొఫెసర్ థామస్ అన్నారు. కరోనాను అడ్డుకునేందుకు హెపటైటిస్-సీ ఔషధాలు పనిచేసే అవకాశముందని తెలియడం శుభవార్తని హర్షం వ్యక్తం చేశారు. కాగా, కరోనా వైరస్‌ని అడ్డుకునే యాంటీబాడీని తయారుచేశామని ఇజ్రాయెల్ కూడా తెలిపింది. జెరుసలేం లోని ప్రధాన బయోలాజికల్ రీసెర్చ్ లేబరేటరీలో ఇది సాధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి సోమవారం తెలిపారు.
  Published by:Shiva Kumar Addula
  First published: