అతడు చనిపోయి రెండు నెలలు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు అతడి కుమారుడి ఫోన్ కు ఎస్ఎంఎస్.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

Cowin App: అతడు చనిపోయి రెండు నెలలు అవుతుంది. కానీ అతడు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు అతడి కుమారుడికి ఎస్ఎంఎస్ రావడంతో కంగుతిన్నాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటివి జరుగుతున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    కరోనా వ్యాప్తి కారణంగా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం అనేది ఎంతో అవసరం. అంతే కాకుండా ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అయితే వీటి నుంచి రక్షణ పొందాలంటే.. ప్రతీ ఒక్కరూ వాటిని ధరించడంతో పాటు వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని వైద్యులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వ్యక్తి అతడి వివరాలను కోవిన్ వెబ్ సైట్ లేదా కోవిన్ యాప్ లో వైద్య సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత మరొక డోసు ఎప్పుడనేది కూడా అందులోనే టైంతో సహా కనిపిస్తుంది. అయితే రెండు డోసులు వేసుకున్న వారు అందులో నుంచే సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    AP Corona Update: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. దేనికి సంకేతం?


    కానీ ఇక్కడ ఓ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. చనిపోయిన వ్యక్తికి టీకా వేసినట్లు కోవిన్‌ యాప్‌లో నమోదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి జులైలో నెలలో చనిపోయాడు. అయితే ఆయనకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ కంప్లీట్ అయినట్లు ఆయన కుమారుడి ఫోన్‌కి సందేశం వచ్చింది. అదే ఫ్యామిలీలో మరో యువకుడు గతంలోనే సెకండ్ డోస్‌ టీకా వేయించుకున్నాడు. ఇలా అతడి ఫోన్ నంబర్ కు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు మెసేజ్ లు వచ్చాయి.

    Children Fight Covid-19: పిల్లలపై కరోనాప్రభావం ఎందుకు తక్కువ?.. మిస్టరీని చేధించిన పరిశోధకులు..


    ఇలా తప్పుడు సందేశాలు రావడంతో అతడు కంగుతిన్నాడు. ఇలాంటివి అంతక ముందు కూడా జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనిపై అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ బాధ్యతను వైద్యఆరోగ్య సిబ్బందితోపాటు ఏఎన్‌ఎంలకు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు చూస్తున్నారు. కొంతమంది సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

    Covid 19: కోవిడ్‌తో తీవ్ర కిడ్నీ సమస్యలు.. అధ్యయనంలో సంచలన నిజాలు.. హెచ్చరిస్తున్న వైద్యులు..


    కరోనా వ్యాక్సినేషన్ ను ప్రతీరోజు ఇంత మందికి వెయాలని టార్గెట్ ఉండటంతో గ్రామాల్లోని ఆధార్‌కార్డులు, ఫోన్‌నెంబర్లు సేకరించి వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు నమోదు చేస్తున్నారు. ఆ వివరాలను కోవిన్ యాప్ లో నమోదు చేసి అప్ డేట్ చేస్తున్నారు. ఇలా వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఇలాంటి సందేశాలు రావడంతో అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపం వల్ల ఇలా జరుగుతున్నాయంటూ తప్పించుకుంటున్నారు.
    Published by:Veera Babu
    First published: