కేంద్ర ఆరోగ్య శాఖలో కరోనా కలకలం...కీలక అధికారికి పాజిటివ్

Covid-19 India Update | కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో కరోనా కలకలం సృష్టించింది. జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు.

news18-telugu
Updated: August 14, 2020, 9:33 PM IST
కేంద్ర ఆరోగ్య శాఖలో కరోనా కలకలం...కీలక అధికారికి పాజిటివ్
కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆరోగ్య, కుటంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు. తనకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో... పాజిటివ్ నిర్థారణ అయినట్లు స్వయంగా ఆయన శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం తాను నిబంధనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. తనను ఈ మధ్య కాలంలో కలిసిన స్నేహితులు, సహోద్యోగులు, ఇతరులు స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు. వైద్య సిబ్బందితో కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అయితే లవ్ అగర్వాల్‌కు కరోనా వ్యాధికి సంబంధించిన లక్షణాలేవీ కనిపించడం లేదని తెలుస్తోంది. దేశంలో కోవిడ్-19 పరిస్థితులు, లాక్‌డౌన్‌కు సంబంధించి లవ్ అగర్వాల్ రోజువారీ మీడియా సమావేశాలు నిర్వహించారు.

ఇటీవల కాలంలో లవ్ అగర్వాల్... ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో సమావేశమై దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్షించారు. అటు ఆరోగ్య శాఖ కార్యదర్శి నీతి ఆయోగ్ సీఈవోతోనూ గురువారం సమావేశమయ్యారు. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ సహా మిగిలిన అందరూ ముందస్తు జాగ్రత్తగా స్వియ నిర్భందంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Published by: Janardhan V
First published: August 14, 2020, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading