Telangana: తెలంగాణలో ముగిసిన కరోనా సెకండ్ వేవ్.. వైద్యఆరోగ్యశాఖ ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముగిసిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరించారు. కొవిడ్‌ చాలావరకు అదుపులోకి వచ్చిందని అన్నారు.

  • Share this:
    18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలంగాణ వైద్యశాఖ సూచించింది. వ్యాక్సిన్ తీసుకుంటేనే పబ్లిక్ ప్లేసుల్లో తిరగడానికి అనుమతిపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో ఇంటింటికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముగిసిందని ఆయన వివరించారు. కొవిడ్‌ చాలావరకు అదుపులోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం వస్తే కొవిడ్‌ కారణంగానే సంక్రమించిందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు.

    జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం మందికి తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించారు. 34 శాతం మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 100శాతం మందికి.. జీహెచ్‌ఎంసీలో 90శాతం మందికి కనీసం ఓ డోస్‌ పూర్తి చేశామని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: