సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర ప్రజలందరికీ వైద్య పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రజలు ఆస్పత్రులకు రావడం కాదు.. వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: May 15, 2020, 9:17 PM IST
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర ప్రజలందరికీ వైద్య పరీక్షలు..
మాస్కు ధరించిన సీఎం కేసీఆర్ (File)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్నా లైట్ తీసుకోవడం లేదు. అందుకే సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలు ఆస్పత్రులకు రావడం కాదు.. వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్న వారికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు. ఒక్కొ ఏఎన్ఎంకు వంద ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలందరికీ మూడు, నాలుగు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: May 15, 2020, 9:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading