హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

హర్యానా కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దులన్నీ మూసివేత

హర్యానా కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దులన్నీ మూసివేత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలో ఇవాళ ఒక్క రోజే 1,024 మంది కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దులను మూసివేసింది హర్యానా.

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇఖ దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పక్కనే ఉండే హర్యానా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హర్యానా నుంచి ఢిల్లీకి అన్ని రాకపోకలను నిలిపివేస్తున్నామని హర్యానా మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ఢిల్లీలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 1,024 మంది కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దులను మూసివేసింది హర్యానా.


ఢిల్లీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం.. గురువారం అక్కడ 1024 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 231 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎవరూ చనిపోలేదు. తాజా లెక్కలతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16281కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7497 మంది కోలుకోగా.. 316 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 8470 యాక్టివ్ కేసులున్నాయి.

అటు హర్యానలో ఇప్పటి వరకు 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 881 మంది కోలుకోగా..19 మంది చనిపోయారు. ప్రస్తుతం హర్యానలో 604 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

First published:

Tags: Coronavirus, Delhi, Haryana, Lockdown

ఉత్తమ కథలు