హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి జీతం డబుల్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘కరోనా వైరస్ ఉన్నంత కాలం, ఆ విభాగంలో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ నెలకు ఇచ్చే జీతం డబుల్ ఇస్తాం.’ అని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. దీంతో పాటు కరోనా వైరస్ విధుల్లో పోలీసులు ఎవరైనా చనిపోతే ఆయా కుటుంబాల వారికి రూ.30లక్షల పరిహారం కూడా ఇస్తామని ప్రకటించారు. గతంలో పంజాబ్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ సేవలు అందించే వారి కోసం రూ.50 లక్షలతో ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ (డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది)కి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది.
ఇప్పటి వరకు హర్యానాలో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5865 కరోనా కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో 5218 చికిత్స పొందుతున్నారు. 477 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Haryana