కరోనా పేషెంట్‌కు హరీశ్ రావు ఫోన్.. వేడినీళ్లు ఉన్నాయా? కషాయం ఇస్తున్నారా?

Harish Rao | ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఫోన్ చేసి సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు మంత్రి హరీశ్ రావు.

news18-telugu
Updated: July 12, 2020, 9:59 PM IST
కరోనా పేషెంట్‌కు హరీశ్ రావు ఫోన్.. వేడినీళ్లు ఉన్నాయా? కషాయం ఇస్తున్నారా?
కరోనా పేషెంట్‌తో ఫోన్లో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు
  • Share this:
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో కరోనా 100 పడకల వార్డు ఏర్పాట్లలో బాగంగా మెడికల్ కాలేజ్ ఆసుపత్రి సందర్శించారు మంత్రి హరీశ్ రావు. ఒకే కుటుంబానికి చెందిన వారికి కరోనా పాజిటివ్ వచ్చి ఐసోలేషన్ వార్డులో వైద్యం పొందుతున్న విషయం తెలుసుకుని వారితో మంత్రి హరీశ్ రావు ఫోన్‌లో మాట్లాడారు. ‘డాక్టర్లు మంచిగా చూసుకుంటున్నారా? భోజనం మంచిగ ఉందా లేదా,’ అని వివరాలు అడిగారు. ‘బాగా చూసుకుంటున్నారు సార్. అన్నం వేడిగా ఇస్తున్నారు.’ అని మహిళ తెలిపింది. మీకు ఆసుపత్రిలో వేడినీళ్లు ఉన్నాయా?, టిఫిన్, టీ ఇస్తున్నారా..?, అని మంత్రి అడిగితే.. టీ ఇవ్వడం లేదని, కషాయం, డ్రై ఫ్రూట్స్, బాదం, రెండు పూటలు అన్నం, ఒక పూట చికెన్ ఇస్తున్నారని, టీ కావాలని మంత్రిని కోరింది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా..? ఆసుపత్రిలోని బాత్ రూములో నీళ్లు వస్తున్నాయా..? లేదా ఆరా తీయగా..అన్నీ బాగానే ఉన్నాయని, వేడినీళ్లు అందిస్తున్నారని పేర్కొంది. మీకు ఇంకేమైనా గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం ఏమైనా వస్తున్నాయా..? అంటూ ఆరా తీయగా దగ్గు, రుచి సరిగ్గా రావడం లేదని వివరించింది. ఇలా.. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో వైద్యులు, వైద్యం అందుతున్న తీరుపై ఆరోగ్యం ఎలా ఉన్నదని, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి మీకేం కాదని బాగుంటారని.. వైద్యులు చెప్పినట్లు నడుచుకోవాలని రోగులను కోరారు.

సిద్దిపేట ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు


రెండు రోజుల్లో కరోనా వంద పడకల ఆసుపత్రి, సంబధిత పరీక్షలు చేసే పరికరాలు తెప్పించి సిద్ధం చేయాలని, ఈ నెల 15న సిద్ధిపేటలో 100 పడకల కరోనా ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు. ఆదివారం సాయంత్రం సిద్ధిపేట జిల్లా ఏరియా ఆసుపత్రిలో కరోనా వంద పడకల ఆసుపత్రి పనుల ఏర్పాట్లు, పురోగతి పై వార్డుల వారీగా గదులు పరిశీలన చేశారు. ఆసుపత్రి చుట్టుపక్కల కలియ తిరుగుతూ.. రోగులకు వచ్చిపోయే దారులు, వారి గదుల్లో సౌకర్యాలు తదితర అంశాలపై వైద్యాధికారులతో అక్కడికక్కడే ఆరా తీశారు. 15వ తేదిలోపు కరోనా వంద పడకల ఆసుపత్రి సంబంధిత పరీక్షలు చేసే పరికరాలు ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నదని వైద్య వర్గాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా రావాల్సిన పరికరాలు త్వరితగతిన పంపాలని ఉన్నతాధికారులకు ఫోన్ లైనులో ఆదేశించారు. అన్ని పరికరాలు తొందరగా తెప్పించుకోవాలని వైద్య వర్గాలకు సూచించారు. 10 వెంటి లేటర్లు తొందరగా ఫిట్టింగ్ చేయించాలని వైద్యాధికారులకు సూచిస్తూ.., సిటీ స్కాను ఇంకా రాకపోవడం.. జాప్యం పై వైద్యాధికారులను ఆరా తీశారు. త్వరగా తెప్పించాని సూచించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 12, 2020, 9:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading