నిజామాబాద్ : కరోనా మహమ్మారి నాయి బ్రాహ్మణుల బతుకులపై చిచ్చురేపింది. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నరు నాయ బ్రాహ్మణులు.. ఇంటి కి షాఫ్ కు అద్దెలు కట్టాలేక చితకి పోతున్నామని వారు వాపోతున్నారు. ప్రభుత్వం మాకు ఎదో ఒక ప్రత్యామ్నాయం చూపించి మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల కుటుంబాలు నాయి బ్రాహ్మణ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు...లాక్ డౌన్ కారణంగా క్షౌరశాలలు ముసివేసారు..దీంతో ఉపాధి లేక నాయి బ్రాహ్మణులు ఆవేదన చెందుతున్నారు.. నగరంలోని నాయి బ్రాహ్మణులకు షాఫ్, ఇంటి అద్దెలు కట్టలేక భారంగా మారాయి.. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి.. షాప్ రెంట్ 5వేల నుంచి 20 వేల వరకు ఉంది.. ఈ రెంట్ కట్టలేని పరిస్థితి గత 30 రోజులుగా ఎలాంటి పని లేక ఖాళీగా ఉన్నారు.. షాపు, ఇంటి అద్దెలే భారంగా మారాయని రమేష్ అనే నాయిబ్రాహ్మణుడు చెపుతున్నారు.. ప్రభుత్వం మా కోసం ఏదైనా ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Covid-19, Nizamabad, Telangana