Home /News /coronavirus-latest-news /

GUNTUR MIRCHI YARD CLOSED AS THREE PEOPLE TESTED POSITIVE FOR COVID SK

ఏపీలో కరోనా విజృంభణ.. గుంటూరు మిర్చి యార్డు మూసివేత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శని, ఆదివారాలు ఎలాగూ మార్కెట్‌కు సెలవు కాబట్టి, తిరిగి సోమవారం నాడు పరిస్థితిని సమీక్షించి యార్డును తెరిపిస్తామని అధికారులు తెలిపారు.

    దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు చోట్ల మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఏపీలోనూ వైరస్ విజృంభిస్తుండడంతో పలు పట్టణాలు, జిల్లాలు తిరిగి లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. ఐతే గుంటూరు మిర్చి యార్డులో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో.. ముందుజాగ్రత్తగా మిర్చి యార్డును మూసివేశారు అధికారులు. ఈ మిర్చి యార్డుకు నిత్యం రాష్ట్రం నలుమూల నుండి వేల సంఖ్యలో రైతులు వస్తుంటారు. ఐతే యార్డులో వ్యాపారులకు కరోనా సోకడంతో, వ్యాపారం నిర్వహించే ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు. శని, ఆదివారాలు ఎలాగూ మార్కెట్‌కు సెలవు కాబట్టి, తిరిగి సోమవారం నాడు పరిస్థితిని సమీక్షించి యార్డును తెరిపిస్తామని అధికారులు తెలిపారు.

    ఇక మిర్చి యార్డు మొత్తాన్నీ సోడియం హైపోక్లోరైడ్‌తో శానిటైజ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వ్యాపారుల వద్దకు వచ్చిన రైతులు, దళారీలు, కూలీలను గుర్తించి, వారిని తగు జాగ్రత్తలతో క్వారైంటైన్‌లో ఉండాలని సూచించినట్టు అధికారులు తెలిపారు. కాగా, గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 958 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించగా.. 511 మంది డిశ్చార్జి అయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 4,988 మంది కోలుకోగా..136 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 5,760 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Coronavirus, Covid-19, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు