సత్తెనపల్లిలో 10 మంది విదేశీయులపై కేసు... స్థానికుల్లో భయం

సత్తెనపల్లిలో అక్రమంగా ఉంటున్న పది మంది విదేశీయుల మీద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: April 8, 2020, 8:14 PM IST
సత్తెనపల్లిలో 10 మంది విదేశీయులపై కేసు... స్థానికుల్లో భయం
నిన్నటి వరకు మొత్తం 7,70,764 టెస్టులు చేశారు.
  • Share this:
సత్తెనపల్లిలో అక్రమంగా ఉంటున్న పది మంది విదేశీయుల మీద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్‌కు చెందిన పది మంది విజిటింగ్ వీసాల మీద భారత్‌కు వచ్చారు. అయితే, సత్తెనపల్లిలోని ఓ మసీదులో ఉన్నారు. దీనిపై సత్తెనపల్లి వీఆర్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ విషయంపై వీఆర్ఓ ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్రం లాక్ డౌన్ విధించింది. అయితే, ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారంటూ వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారంతా ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చి ఉంటారని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 49 కేసులు గుంటూరు జిల్లాలోనే నమోదయ్యాయి. అందులో ప్రధానంగా గుంటూరు నగరంలోనే ఎక్కువగా ఉన్నాయి. సత్తెనపల్లిలో కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు విదేశీయులు ఇక్కడ ఉన్నారంటూ ప్రచారం జరగడం, పోలీసులు ఏకంగా కేసులు కూడా నమోదు కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
First published: April 8, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading