Andhra Pradesh: బాబోయ్ కరోనా కాలం.. పెళ్లి పిలుపులకు వచ్చారు.. ఊహించని షాక్ ఇచ్చారు..

Andhra Pradesh: బాబోయ్ కరోనా కాలం.. పెళ్లి పిలుపులకు వచ్చారు.. ఊహించని షాక్ ఇచ్చారు..

పెళ్లి పిలుపులకు వచ్చారు.. బంగారం దోచేశారు.

కరోనా టైంలో వివాహాలు వాయిదా వేసుకుంటున్నారు. కొంతమంది పెళ్లిళ్లు జరుపుతున్నా.. ఎవరినీ పిలకుండా దగ్గర బంధువులతో సరిపెడుతున్నారు. కానీ ప్రకాశం జిల్లాలకు చెందిన ఓ తల్లి కూతురు.. పెళ్లి పిలుపులకు అంటూ గుంటూరులో ఉన్న ఓ సన్నిహితుల ఇంటికి వచ్చారు. కర్ఫ్యూ టైం కదా రాత్రి నిద్రించి ఉదయం వెళ్లండి అన్న పాపానికి ఏం చేశారో తెలుసా?

 • Share this:
  ఏపీని కరోనా మహమ్మారి భయపెడుతోంది. ఇలాంటి సమయంలో అంతా భయం భయంగా ఉంటే.. ఆ పేరు చెప్పి మోసాలకు పాల్పడే వారు చాలామందే ఉన్నారు. మనుషుల కష్టాలను క్యాష్ చేసుకుంటూ దోచేసుకుంటున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. తెలిసిన వారే కాదా.. అందులోనూ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు కదా అని సాధరంగా ఆహ్వానించింది ఓ కుటుంబం.. కరోనా భయపెడుతున్న సమయంలో రాత్రి పూట ఏం వెళ్తారు.. ఉదయం లేచి వెళ్లండి అని చెప్పడమే పాపమైంది.. కానీ ఉదయం లేచి బీరువా తీస్తే షాక్ తినాల్సి వచ్చింది...

  కరోనా కరాణంగా ప్రపంచ అంతా అల్లకల్లోలం అవుతున్నా కంత్రీలు మాత్రం సైలెంట్ గా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. నమ్మిన వారిని నట్టేట ముంచేస్తున్నారు కొంత‌మంది కంత్రీలు. తాజాగా గుంటూరులో జ‌రిగిన ఓ దొంగతనం అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. ఇలా కూడా దొంగతనాలు చేస్తారా? అసలు ఎవరిని నమ్మాలి కరోనా కాలంలో అంటూ నోరు వెళ్లబెడుతున్నారు..

  ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మనీషాకు గుంటూరు వికాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాధా దేవి కుటుంబంతో పరిచయం ఉంది. ఆ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయి. అప్పుడప్పుడూ గుంటూరు వెళ్లి రాధాదేవి ఇంటికి వచ్చి మనీషా కష్ట సుఖాలు మాట్లాడుతూ ఉంటుంది. సన్నిహితురాలే అని ఆ ఇంట్లో ఎలా కావాలంటే అలే ఉండేలా చనువు ఇచ్చింది రాధాదేవి కుటుంబం. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్‌ 28న మనీషా తన తల్లి రూన్సీతో కలిసి గుంటూరు వికాస్‌నగర్‌లోని రాధాదేవి ఇంటికి వచ్చింది. మనీషాకు పెళ్లి కుదిరింద‌ని.. పిలవడానికి వచ్చినట్లు వారు చెప్పారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన రాధాదేవి.. వారికి విందు భోజనం ఏర్పాటు చేసింది. పెళ్లి ముచ్చట్లు, కరోనా ముచ్చట్లతో అక్కడే ఆలస్యమైంది. అయితే అప్పటికే రాత్రి అవ్వడం.. మరోవైపు కరోనా భయం.. అందులోనూ కర్ఫ్యూ ఉండడంతో రాత్రికి ఇంటిలో ఉండి.. మరుచటి రోజు వెళ్లమని రధాదేవి చెప్పింది..

  రాధాదేవి చెప్పిన మాటలకు సరే అన్న మనీషా, వాళ్ల అమ్మ కూడా రాత్రికి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుతూనే ఒంగోలుకు వెళ్లిపోయారు. అయితే తరువాత ఏదో పని మీద రాధాదేవి బీరువా ఓపెన్ చేసి చూసి షాక్ కు గురైంది. అందులో ఉండాల్సిన బంగారపు వడ్డాణం, చెవిదిద్దులు, నక్లెన్‌, పట్టుచీర అన్నీ మిస్ అయ్యాయి. వెంటనే రాధాదేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మొదటి అనుమానితులుగా మనీషా, ఆమె తల్లి రూన్సీలే అని భావించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని త‌మ‌దైన స్ఠైల్లో విచారించ‌గా.. చోరీ చేసిన‌ట్లు అంగీక‌రించారు. ఇద్దర్ని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సోమవారం అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 10 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. పాపం కరోనా.. కర్ఫ్యూ అని తెలిసిన వారే కదా అని జాలిపడినందుకు.. ఇంటినో దోచేశారు ఆ కంత్రీలు.. మరి కరోనా కాలంలో ఎవరిని నమ్మాలి అని గుంటూరు వాసులు భయపడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు