Home /News /coronavirus-latest-news /

GUJARAT MINSTER SAYS PRE CONDITION FOR VACCINE TO FREE RATION CONGRESS LEADERS OPPOSED NGS

Vaccine: వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే రేషన్.. ఆ మంత్రి సంచలన కామెంట్స్..

వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్

వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్

ఇకపై రేషన్ తీసుకొవాలి అంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉండాల్సిందేనా.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉన్నవాళ్లకే రేషన్ ఇవ్వాలని కండిషన్ పెడుతున్నారు. ఓ మంత్రి మాత్రం అదే డిమాండ్ చేస్తున్నారు..

    కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ అందాలి అంటే ఇకపై వ్యాక్సిన్ తప్పని సరి తీసుకోవాల్సిందేనా..?  వ్యాక్సిన్ తీసుకున్నామని సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రమే ఉచిత రేషన్ ఇస్తారా..? ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. స్వయనా ఓ మంత్రి. గుజరాత్ కు చెందిన మంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగేష్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై గుజరాత్ లో ఉచిత రేషన్ కావాలి అంటే వ్యాక్సిన్ వేసుకుని ఉండాలన్నారు. దీనికి సబంధించి కేంద్రానికి తాను సూచనలు చేస్తానని వ్యాఖ్యనించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. అక్కడి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై మండిపడుతోంది. ఎక్కడా కేంద్రం అలాంటి నిబంధన పెట్టనప్పుడు.. గుజరాత్ లో మాత్రం ఎలా అప్లై చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు ఒక రూలు.. గుజరాత్ కు ఒక రూలా అని నిలదీస్తున్నారు. బలవంతంగా ఇలాంటి చర్యలకు పూనుకుంటే అందుకు తమ పార్టీ అంగీకరించదని స్పష్టం చేసింది.  భారీ ఎత్తున పోరాటం తప్పదని కాంగ్రెస్ మరోసారి హెచ్చరించింది..

    కాంగ్రెస్ విమర్శలు ఎలా ఉన్న గుజరాత్ మంత్రి వెనక్కు తగ్గడం లేదు. దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేసి సీఎం విజయ రూపానికి అందజేస్తాను అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకు ఇలాంటి లింకులు పెడితేనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది అన్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన జిల్లా కలెక్టర్ కు.. సీఎం కు కూడా ఇది పాటించమని చెబుతాను అన్నారు.

    కరోనా నేపథ్యంలో వచ్చే దీపావళి వరకు పేదలు అందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫా చేయాలని కేంద్రం నిర్ణయించిందని.. ఈ అద్భుత పథకానికి ప్రధాని నరేంద్రమోదీ రూపకల్పన చేశారన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పేదలకు ఈ పథకాలు అందుతున్నాయన్నారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా అమలవ్వాలి అంటే ఇలాంటి కండిషన్లు పెట్టాలని అప్పుడే కరోనా కట్టడిలోకి వస్తుందని మంత్రి యోగేష్ అభిప్రాయపడ్డారు.

    త్వరలో దీన్ని అమలు చేసి తీరుతామని మంత్రి చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నిజంగా వ్యాక్సిన్ కు .. రేషన్ కు లింకు పెడితే భారీ ఉద్యమం తప్పదని హెచ్చిరిస్తున్నాయి. పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తే సహించమని అంటున్నాయి. అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్థానిక అధికారులు ఇలాంటి కండిషన్లు కొన్ని పెడుతున్నారు. అవన్నీ తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పుడు నేరుగా మంత్రే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ రగడ రాజేస్తోంది...
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Corona Vaccine, Free Ration, Free vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు