Spike in Coronavirus Cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు

Spike in Coronavirus Cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ఆ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా...

  • Share this:
    అహ్మదాబాద్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ఆ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో.. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్‌లో నైట్ కర్ఫ్యూ మరో పక్షం రోజుల పాటు కొనసాగనుంది. గత నవంబర్ నుంచి.. నైట్ కర్ఫ్యూను పొడిగించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.

    అయితే.. తాజాగా అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూలో సమయాన్ని మార్చిన ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత నైట్ కర్ఫ్యూ అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే అమలుకానుంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలయిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.

    గుజరాత్‌లోని మొత్తం 4.82 లక్షల హెల్త్ కేర్ వర్కర్లకు గానూ, 4.07 లక్షల మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. గుజరాత్‌లోని దాదాపు 84 శాతం హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సిన్ పొందారు. అంతేకాదు, 5.41 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు గానూ, 4 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్ సెకండ్ డోస్‌ను కూడా 1.23 లక్షల మంది హెల్త్‌కేర్ వర్కర్లకు ఇచ్చినట్లు వెల్లడించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు