Covid-19: కోవిడ్ కేర్ సెంటర్‌లో రోగులకు గోమూత్రం పంపిణీ.. ఎక్కడో తెలుసా..

Covid-19: కోవిడ్ కేర్ సెంటర్‌లో రోగులకు గోమూత్రం పంపిణీ.. ఎక్కడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సోకినవారు కొందరు ఆయుర్వేద మందులు వాడుతున్నారు

  • Share this:
    కరోనా సోకినవారు కొందరు ఆయుర్వేద మందులు వాడుతున్నారు. తాజాగా ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. అక్కడివారికి ఆవు మూత్రం, పాలు నుంచి తయారు చేయబడిన మందులను కరోనా రోగులకు ఇస్తున్నారు. ఈ ఘటన గుజరాత్‌లో బనస్కాంత జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు గల వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కోవిడ్ సెంటర్‌కు వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో ఏడుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ సంద‌ర్భంగా గోశాల ట్ర‌స్టీ మోహన్ జాదవ్ మాట్లాడుతూ.. క‌రోనా పాజిటివ్ బాధితుల‌ను ఈ సెంట‌ర్‌లో చేర్చుకుంటున్నట్లు తెలిపారు. మే 5వ తేదీన ఈ సెంటర్‌ను ప్రారంభించినట్టు వెల్లడించారు. దీసా తాలుకాలోని 7 మంది కరోనా రోగులు ఇక్కడ ప్రవేశం పొందినట్టు వివరించారు.

    ఇక్కడ రోగులకు 8 ఆయుర్వేద మందులతో చికిత్స చేస్తున్నామని తెలిపారు. ఈ మందులు ఆవు పాలు, నెయ్యి మరియు ఆవు మూత్రం నుండి తయారు చేయబడ్డాయని పేర్కొన్నారు. ఈ సెంటర్‌లో చికిత్స కోసం కరోనా రోగుల నుండి డబ్బు తీసుకోవడం లేదని చెప్పారు. దగ్గు చికిత్స కోసం దగ్గు చికిత్స కోసం ఆవు మూత్రం ఆధారిత ఔషధాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ఇద్దరు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కరోనా రోగులు 24 గంటల పాటు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

    ఇండియాలో కొత్తగా 4,03,738 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. కొత్తగా 4,092 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,42,362కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,86,444 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,83,17,404కి చేరింది. రికవరీ రేటు 82.2 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్‌లో 37,36,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,65,428 మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 30 కోట్ల 22లక్షల 75వేల 471 టెస్టులు చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: