హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron-Fine: టీకా తీసుకోని వారికి నెలకు రూ.8 వేలు ఫైన్..; ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై WHO కీలక ప్రకటన..

Omicron-Fine: టీకా తీసుకోని వారికి నెలకు రూ.8 వేలు ఫైన్..; ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై WHO కీలక ప్రకటన..

ప్రపంచమంతా కరోనా బారి నుంచి కాస్త ఉపశమనం పొందగా, చైనాలో మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ లో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చి, వాయి వేగంతో వ్యాప్తి చెందుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి  లాక్‌డౌన్‌ విధించినా ఫలితం కానరాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచమంతా కరోనా బారి నుంచి కాస్త ఉపశమనం పొందగా, చైనాలో మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ లో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చి, వాయి వేగంతో వ్యాప్తి చెందుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్‌ విధించినా ఫలితం కానరాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)

Omicron-Fine: ఇప్పడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖంపట్టి అన్ని వ్యవస్థలు గాడిలోపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్(Omicron) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై కొన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...

ఇప్పడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖంపట్టి అన్ని వ్యవస్థలు గాడిలోపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్(Omicron) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై కొన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అందులో యువత, మధ్య వయస్కులతో పాటు.. వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ తప్పని సరి చేస్తూ.. గ్రీస్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా.. 60 ఏళ్లు పైబడిన వారు టీకా వేసుకోకుంటే నెలవారీగా ఫైన్ వసూలు చేస్తామంటూ హెచ్చరించారు గ్రీక్ ప్రధాని కైరకోస్. ఫైన్ అనగానే చాలామంది కోవిడ్ టీకా సెంటర్లకు క్యూలు కట్టేశారు. ఒక్క డోసు టీకా వేయించుకొని.. రెండో టీకా వేసుకోవడానికి నిర్లక్ష్యం వహించే వాళ్లు కూడా టీకా తీసుకోవడం కోసం సెంటర్లకు వెళ్తున్నారు.

Telangana To Goa MlC Elections: గోవా బీచ్‌కు చేరిన ఎమ్మెల్సీ రాజకీయం.. అక్కడ ఏం కావాలన్నా క్షణాల్లోనే..


2022, జనవరి 16 లోగా వ్యాక్సిన్ వేయించుకోవాలని లేకపోతే నెలకు రూ.8,545 జరిమానా కింద వసూలు చేస్తామని స్పష్టం చేసింది గ్రీస్ ప్రభుత్వం. కొన్ని నిర్ణయాలు కఠినంగానే అనిపిస్తాయి.. కానీ.. వాటి ఫలితాలు ప్రతీ ఒక్కరికి మెచ్చే విధంగా ఉంటాయని ప్రధాని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఫాలో అవ్వాల్సిందేనని కైరకోస్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితిపై నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధాని తీసుకున్న తాజా నిర్ణయం మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా..ఒమిక్రాన్ వేరియంట్ పై కీలక ప్రకటన చేసింది ప్రపంచఆరోగ్య సంస్థ.

School Students: ఆ విద్యార్థులు మోకాళ్లపై ఎందుకు కూర్చున్నారో తెలుసా.. కారణం తెలిస్తే..


కొత్త వేరియంట్ వైరస్ మునుపటి కంటే వేగంగా వ్యాపిస్తుందని.. కానీ భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఎటువంటి మరణాలకు దారి తీయలేదని తెలిపింది. తొలుత ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో మొత్తం కేసులను మూడు మిలియన్లు దాటాయి. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సహా ఇప్పటికి 30కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

Anchor Srimukhi Hot Photos: జాకెట్‌ బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రీముఖి.. ఫొటోలు వైరల్..


దాని లక్షణాలు, తీవ్రత, సంక్రమణ వేగం వంటి అంశాలపై ఇంకా సమగ్ర విషయాలు వెల్లడి కాకపోవడంతో ఈ ఆందోళనలు మరింత అధికం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి ప్రమాదకరమైనదా.. అంటువ్యాధా.. టీకాలు దీనిపై ఎలా సమర్థవంతంగా పని చేస్తున్నాయి అనేవి తెలుసుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ గురించిన సమాచారాన్ని ఆ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాలన్నింటి నుంచి డేటాను సేకరిస్తున్నట్టు ఆ సంస్థ వివరించింది. కానీ ఇంతవరకు ఒమిక్రాన్ వైరస్ బారిన పడి మరణించిన వాళ్లు ఇంతవరకు ఒక్కరు కూడా లేరంటూ చెప్పుకొచ్చాడు.

First published:

Tags: Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు