పతంజలి కరోనా మందుకు కేంద్రం బ్రేక్.. ప్రకటనలు ఆపాలని ఆదేశం

కరోనా మందును లాంచ్ చేసిన పతంజలి

శాస్త్రీయ అధ్యయనం, ఔషధ ప్రయోగాలు చేసిన తర్వాతే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని రాందేవ్ బాబా ఇవాళ మీడియాకు తెలిపారు. పతంజలి కరోనా కిట్ రూ.545కి అందుబాటులో ఉంటుందని చెప్పారు.

  • Share this:
    కరోనాకు ఆయుర్వేద మందును లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే పతంజలి సంస్థకు కేంద్రం షాక్ ఇచ్చింది. కరోనా ఔషధానికి సంబంధించిన పూర్తి పరిశోధనా వివరాలు అందజేయాలని.. అప్పటి వరకు ప్రకటనలను నిలిపివేయాలని ఆయుష్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి మందు కరోనిల్‌ తయారీలో వాడిన ఔషధాలు ఏంటి? ఎంత మోతాదులో ఉన్నాయి? ఏ ఆస్పత్రుల్లో ఔషద ప్రయోగాలు చేశారు? సంబంధిత పరిశోధనల ఫలితాల వివరాలు, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ వివరాలను తమకు అందించాలని స్పష్టం చేసింది. అంతేకాదు కరోనిల్ తయారీకి మంజూరు చేసిన లైసెన్స్ కాపీలు, అనుమతి వివరాలను అందించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరింది.

    కాగా, మంగళవారం మధ్యాహ్నమే పతంజలి సంస్థ కరోనా నివారణ ముందు కరోనిల్‌, శ్వాసరిలను ఆవిష్కరించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ కార్యక్రమంలో యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ పాల్గొన్నారు. కరోనాను తరిమికొట్టే తొలి ఆయుర్వేద ముందు ఇదేని వారు చెప్పారు. ఈ మందు తీసుకున్న తర్వాత 69శాతం మంది కరోనా పేషెంట్లు కేవలం 3 రోజుల్లోనే కోలుకున్నారని చెప్పారు. ఇక ఏడు రోజుల్లో వంద శాతం మంది కరోనా రోగులు కోలుకున్నారని తెలిపారు.


    రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులు, పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో 150కి పైగా ఔషధ మూలికలతో కరోనిల్ ఔషదాన్ని రూపొందించామని పతంజలి సంస్థ ఇటీవల ప్రకటించింది. శాస్త్రీయ అధ్యయనం, ఔషధ ప్రయోగాలు చేసిన తర్వాతే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని రాందేవ్ బాబా ఇవాళ మీడియాకు తెలిపారు. ఇందులో అశ్వగంధ, తిప్పతీగ వంటి ఔషద మూలికలు ఉన్నాయని వెల్లడించారు. పతంజలి కరోనా కిట్ రూ.545కి అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఐతే ఈ మందును లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే... పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా పతంజలి సంస్థకు ఆయుశాఖ ఆదేశాలు జారీ చేసింది.
    First published: