COVID Victims Dead Bodies: ఈయన అంబులెన్స్ డ్రైవర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అసలు ఈయనెవరో తెలిస్తే..

ప్రభుత్వ అధికారి అనిల్ క్రిస్టీ, పీపీఈ కిట్ ధరించి అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్న దృశ్యం

కర్ణాటకలోని మైసూర్ సిటీ కార్పొరేషన్‌లో జననమరణ గణాంకాల అధికారిగా అనిల్ క్రిస్టీ పనిచేస్తున్నారు. అంతేకాదు.. కరోనా కట్టడిలో భాగంగా పనిచేస్తున్న మైసూర్‌లోని ముగ్గురు నోడల్ అధికారుల్లో ఆయన ఒకరు. ఆసుపత్రుల్లో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలను శ్మశానాలకు తరలించేలా చూసుకోవడం కూడా ఆయన విధుల్లో ఒకటి.

 • Share this:
  మైసూరు: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. పెరుగుతున్న కొత్త కరోనా కేసులతో పాటు మరణాలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గడచిన 24 గంటల్లో కర్ణాటకలో 292 మంది కరోనా సోకిన బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో.. ఒక్క బెంగళూరు నగరంలోనే 132 మంది కరోనా కారణంగా చనిపోయారు. పెరుగుతున్న కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు శ్మశానవాటికల్లో అనువైన పరిస్థితులు లేక హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్న పరిస్థితులున్నాయి. కరోనా తీవ్రత ఇంతగా ఉండటంతో వైరస్ సోకి చనిపోయిన తమ వారిని ఆసుపత్రుల నుంచి శ్మశానవాటికలకు తరలించడం కుటుంబ సభ్యులకు పెను సవాల్‌గా మారింది. కొందరు అంబులెన్స్ డ్రైవర్లయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనికరం చూపడం లేదు. కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానాలకు తరలించేందుకు బాధిత కుటుంబాల నుంచి వేలకు వేలు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు ఇంత అమానవీయంగా తయారైన ఈ సమయంలో కర్ణాటకలో ఓ ప్రభుత్వ అధికారి నలుగురికి ఆదర్శంగా నిలిచే పని చేశారు. ఆయన చూపిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

  కర్ణాటకలోని మైసూర్ సిటీ కార్పొరేషన్‌లో జననమరణ గణాంకాల అధికారిగా అనిల్ క్రిస్టీ పనిచేస్తున్నారు. అంతేకాదు.. కరోనా కట్టడిలో భాగంగా పనిచేస్తున్న మైసూర్‌లోని ముగ్గురు నోడల్ అధికారుల్లో ఆయన ఒకరు. ఆసుపత్రుల్లో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలను శ్మశానాలకు తరలించేలా చూసుకోవడం కూడా ఆయన విధుల్లో ఒకటి. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం కేఆర్ హాస్పిటల్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తి కరోనా మృతదేహాలను ఆసుపత్రి నుంచి శ్మశానాలకు తరలిస్తున్న క్రమంలో అనారోగ్యానికి లోనయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అనిల్ క్రిస్టీ రవిని విశ్రాంతి తీసుకోమని చెప్పారు.

  ఇది కూడా చదవండి: Peepal Tree: రెండు కుటుంబాల్లో 12 మందికి కరోనా.. అందరూ రావిచెట్టు కిందే.. ఎందుకని అడిగితే..

  రవి స్థానంలో తాత్కాలికంగా ఎవరినైనా తీసుకుందామని భావించి ప్రయత్నించినప్పటికీ కరోనా మృతదేహాలను తరలించే పని కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ కారణంగా కేఆర్ హాస్పిటల్‌లో కరోనా కారణంగా చనిపోయిన కొందరి మృతదేహాలను తరలించడం కష్టంగా మారింది. తమ వారి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ ఎవరైనా రాకపోతాడా అని ఆ కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఈ పరిస్థితిని కళ్లారా చూసిన అనిల్ క్రిస్టీ అంబులెన్స్ డ్రైవర్‌గా మారారు. పీపీఈ కిట్ ధరించి అంబులెన్స్ డ్రైవర్‌‌గా కూర్చుని మార్చరీస్‌లో ఉన్న కరోనా మృతదేహాలను శ్మశానానికి తరలించారు. మరో ఆలోచన లేకుండా ఆయన చేసిన ఈ పనికి జిల్లా సీనియర్ అధికారులు, నెటిజన్లు ఫిదా అయ్యారు.

  ఇది కూడా చదవండి: Dakshi Guttikonda: ఆర్జీవీ ‘కరోనా వైరస్’ సినిమాలో నటించిన ఈ బెజవాడ అమ్మాయి ఇప్పుడెలా ఉందంటే.. నమ్మలేరు..!

  ఇప్పుడు మాత్రమే కాదు.. కరోనా మహమ్మరి గత సంవత్సరం ఉధృతంగా మారిన తరుణంలో కూడా అనిల్ క్రిస్టీ, ఆయన టీం ఎన్నో మంచి పనులు చేశారు. అంబులెన్స్ డ్రైవర్‌గా మారడంపై ప్రభుత్వ ఉద్యోగి అయిన అనిల్ స్పందిస్తూ.. అంబులెన్స్ డ్రైవర్‌గా ఉన్న రవికి అనారోగ్యంగా ఉండటంతో అంబులెన్స్ డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడని.. ఆసుపత్రి బయట కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలు తమ వారి అంత్యక్రియలకు మృతదేహాలను తరలించేందుకు గంటల కొద్దీ ఎదురుచూస్తుండటం తనను కలచివేసిందని ఆయన చెప్పారు. దీంతో.. అంబులెన్స్ డ్రైవ్ చేసి ఆసుపత్రి నుంచి నాలుగు ట్రిప్పుల్లో మృతదేహాలను శ్మశానానికి తరలించినట్లు అనిల్ క్రిస్టీ తెలిపారు.
  Published by:Sambasiva Reddy
  First published: