ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు.

news18-telugu
Updated: August 15, 2020, 6:19 PM IST
ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతి రోజు 50వేలకు పైగా కొత్త కేసులు, 900కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న సంపూర్ణ లాక్‌డౌన్‌ను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు.


కాగా, మణిపూర్ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి ఇప్పటి వరకు 2,360 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మణిపూర్‌లో 13 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 1,825 యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 6:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading