కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయుష్​ మంత్రిత్వ శాఖ

కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయుష్​ మంత్రిత్వ శాఖ

ప్రతీకాత్మక చిత్రం

కరోనా చికిత్సకు సిఫార్సు చేసిన ఈ పాలిహెర్బల్ ఆయుర్వేదిక్​ మెడిసిన్​ను 1980లోనే తయారు చేశారు. అప్పటి నుంచి దీన్ని మలేరియా, ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్​ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనాకు చెక్​ పేట్టేందుకు ప్రస్తుతం ఇంగ్లీషు మందులనే వాడుతున్నాం. అయితే, మలేరియాను తగ్గించడానికి భారత్‌లో 40 ఏళ్ల క్రితం తయారు చేసిన ఆయుష్​–64 అనే ఔషధం కరోనా చికిత్సకు కూడా ఉపయోగపడుతుందని పరిశోధకులు తేల్చారు. దీంతో ఈ మందులను వాడేందుకు ఆయుష్​ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే స్వల్ఫ, మధ్యస్థ లక్షణాలతో కరోనా బారిన పడిన వారి విషయంలోనే ఇది పనిచేస్తుందని.. వారికి మాత్రమే సిఫార్సు చేస్తున్నామని స్పష్టం చేసింది. వీటి లభ్యతను పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. కాగా, కరోనా చికిత్సకు సిఫార్సు చేసిన ఈ పాలిహెర్బల్ ఆయుర్వేదిక్​ మెడిసిన్​ను 1980లోనే తయారు చేశారు. అప్పటి నుంచి దీన్ని మలేరియా, ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు.

తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న వారు దీన్ని వాడితే త్వరగా కోలుకుంటున్నారని క్లినికల్​ ట్రయల్స్​లో గుర్తించినట్టు ఆయుష్​ మంత్రిత్వ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ క్లినికల్​ ట్రయల్స్​ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) నిర్వహించింది. ఈ ఔషధాన్ని స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న మొత్తం 210 మంది కరోనా రోగులపై ప్రయోగించగా, ఉత్తమ ఫలితాలనిచ్చింది. దీంట్లోని యాంటీవైరల్, రోగనిరోధక -మాడ్యులేటర్, యాంటీపైరెటిక్ లక్షణాలు కరోనాకు చెక్​ పెట్టగలవని తేలింది.

ఉత్పత్తి పెంచేందుకు చర్యలు..
దేశ వ్యాప్తంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఈ మందును అందుబాటులోకి తేవాలని ఆయుష్​ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయుష్​–64 మెడిసిన్​ను తయారు చేసేందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని తెలిపింది. మెడిసిన్​ తయారీకి కావాల్సిన అన్ని అనుమతులను త్వరితగితిన ఇస్తామని ఆయుష్​ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆయుష్​–64 మెడిసిన్​ ఉత్పత్తిని పెంచి.. భారీ సంఖ్యలో కోవిడ్​ బాధితులకు అందజేయాలని యోచిస్తోంది. కాగా, ఆయుష్​–64 ఉత్పత్తి, వాణిజ్యీకరణను పెంచడానికి సిసిఆర్ఎఎస్, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్​డీఆర్​సీ) ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఈ స్వదేశీ మెడిసిన్ వాడకం​తో దేశంలో ఎంతవరకు కరోనా తగ్గుముఖం పడుతుందనే విషయం తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
First published:

అగ్ర కథనాలు