కరోనాపై పోరుకు ‘ధన్వంతరి రథ్’.. గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం..

కరోనా వైరస్‌పై పోరుకు గుజరాత్ ప్రభుత్వం ధన్వంతరి రథ్‌ను రంగంలోకి దించింది. ముందుగా అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 వాహనాలను ఉంచింది.

news18-telugu
Updated: May 28, 2020, 1:00 PM IST
కరోనాపై పోరుకు ‘ధన్వంతరి రథ్’.. గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం..
ధన్వంతరి రథ్
  • Share this:
కరోనా వైరస్‌పై పోరుకు గుజరాత్ ప్రభుత్వం ధన్వంతరి రథ్‌ను రంగంలోకి దించింది. ముందుగా అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 వాహనాలను ఉంచింది. 14 కంటైన్మెంట్లలోని 200 చోట్ల వీటిని ఉంచి ప్రజలకు వైద్యం అందించారు. ఇప్పుడు 84 రథాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిని 336 లొకేషన్లలో మోహరించి, మంచి వైద్యం అందిస్తున్నారు. ఒక్కో వాహనంలో డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, ఫార్మాసిస్టులు ఉంటారు. ధన్వంతరి రథ్ వద్ద.. థర్మల్ గన్‌తో శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తున్నారు. అనంతరం సదరు వ్యక్తికి మధుమేహం, బీపీ పరీక్షించి తదితర సమాచారాన్నంతా నమోదు చేస్తున్నారు. ఆక్సిజన్ స్థాయులను పరీక్షించేందుకు ఆక్సీ మీటర్లను కూడా రెడీ చేశారు. అవసరమైతే రోగికి పారాసిటమాల్, సిట్రిజెన్, అజిత్రోమైసిన్ టాబ్లెట్లు ఇస్తున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచేందుకు హోమియోపతి ముందులు, ఆయుర్వేద మందులు అందజేస్తున్నారు. ఈ వాహనాల వద్దకు వచ్చిన రోగుల రికార్డులన్నింటినీ పరీక్షించగా 10 శాతం పేషెంట్లు జ్వరంతో, 32 శాతం రోగులు జలుబు, దగ్గు, 0.6 శాతం మంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇప్పటి దాకా 71 వేల మంది ధన్వంతరి రథ్‌ వల్ల లబ్ధి పొందారు. దాంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసులు కూడా ప్రభావవంతంగా తగ్గుముఖం పట్టాయి.
First published: May 28, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading