హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

మద్యం బంద్‌తో ఖజానా ఖాళీ.. ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?

మద్యం బంద్‌తో ఖజానా ఖాళీ.. ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఏప్రిల్ 20 తర్వాత సడలింపు ఇచ్చే వాటి జాబితాలో వైన్ షాపులు ఉండబోవని తేల్చిచెప్పింది.

  కరోనా లాక్‌డౌన్‌తో అన్నింటితో పాటు మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. చుక్క మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. బ్లాక్‌మార్కెట్‌లో నాలుగు రెట్లకు లిక్కర్ అమ్ముతుండడంతో.. అంతపెట్టి కొనలేక..మందు తాగడకుండా ఉండలేక.. గిలాగిలా కొట్టుకుంటున్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐతే మద్యం షాపుల మూతపడడంతో ముందుబాబులకే కాదు.. ప్రభుత్వానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌తో ఇప్పటికే అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వానికి రాబడి లేక ఖజానా ఖాళీ అవుతోంది. ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే వైన్ షాపులే మూతపడడంతో ప్రభుత్వ వద్ద డబ్బు నిల్వలు అంతకంతకూ తరుగుతున్నాయి.

  మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో పలు పెద్ద రాష్ట్రాలకు రోజుకు రూ.700 కోట్లు వచ్చే రాబడి ఆగిపోయింది. దేశంలో చాలా రాష్ట్రాలకు 15-30 శాతం రెవెన్యూ మద్యం ద్వారానే వస్తుంది. ఏడాదికి రూ.2.48 లక్షల ఆదాయం వస్తుంది. మద్యంషాపులను మూసివేయడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నెలలో రూ.2వేల కోట్ల ఆదాయం కోల్పోనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.24 వేల కోట్లు ఆదాయం లిక్కర్ ద్వారానే వచ్చింది. యూపీకి రూ.26 వేల కోట్లు, తెలంగాణకు రూ.22వేల కోట్లు, కర్నాటకలకు 20వేల కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు 11,874 కోట్లు, రాజస్థాన్‌కు రూ.7,800 కోట్లు, పంజాబ్ ప్రభుత్వానికి రూ.5,600 కోట్ల ఆదాయం వచ్చింది. అంతలా రాష్ట్రాల ఖజానాను నింపుతాయి లిక్కర్ సేల్స్..!

  ప్రస్తుతం లాక్‌డౌన్‌తో మద్యం అమ్మకాలతో పాటు అన్ని రంగాలు స్తంభించిపోవడంతో రాష్ట్రాలకు ఆదాయం రావడం లేదు. దాంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల నడుమ వైన్ షాపులకు అనుమతించాయి. అటు ఆల్కాహాల్ సెక్టార్‌కు చెందిన పలు సంస్థలు కూడా కేంద్రానికి లేఖరాశాయి. కనీసం ఆన్‌లైన్ డోర్ డెలివరీ ద్వారానైనా అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశాయి.

  ఐతే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఏప్రిల్ 20 తర్వాత సడలింపు ఇచ్చే వాటి జాబితాలో వైన్ షాపులు ఉండబోవని తేల్చిచెప్పింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 20 తర్వాత ఇవ్వనున్న సడలింపులో మద్యం దుకాణాలు లేవు. మద్యం రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది. అందుకే కేంద్రం ఎలాంటి ఎలాంటి సడలింపు ఇవ్వడం లేదు. అమ్మకాలపై నిషేధం విధిస్తూ మార్గదర్శకాలిచ్చాం కూడా. కానీ, కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో మద్యం అమ్మాలని చూస్తున్నాయి. వాటిపై నిర్ణయం రాష్ట్రాలదే’ అని తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్యం షాపులను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ.. ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Alcohol, Liquor sales, Liquor shops, Lockdown, Wine shops