వర్క్ ఫ్రమ్ హోమ్... కరోనా వైరస్ సంక్షోభంతో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. చాలావరకు కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. తమ ఉద్యోగులకు కూడా గూగుల్ గుడ్ న్యూస్చెప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే తమ ఉద్యోగులందరికీ రూ.75,000 చొప్పున అలవెన్సులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ అలవెన్స్‌తో ఉద్యోగులు ల్యాప్‌టాప్ నుంచి ఫర్నీచర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు కావాల్సిన గ్యాడ్జెట్స్ కొనుక్కోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు ఇబ్బందులు ఉండొద్దని, ఇంట్లో సౌకర్యవంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో గూగుల్ ఈ అలెవన్సును ప్రకటించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ఈ అలవెన్స్ కాస్త భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇంట్లోనే సమర్థవంతంగా పనిచేసేందుకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ నిర్ణయం ఈ కష్టకాలంలో ఉద్యోగుల గురించి కంపెనీ ఆలోచిస్తుందన్న ధైర్యాన్ని ఇస్తుంది. ఇక జూలై 6 నాటికి ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆఫీసులను తెరిచే ఆలోచనలో ఉంది గూగుల్. ప్రతీ ఆఫీసులో 10% మంది ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. ఆఫీసుకి వచ్చి పనిచేయాలనుకునేవారికి అనుమతి ఇవ్వనుంది.
ఇవి కూడా చదవండి:
Work From Home: ఈ గ్యాడ్జెట్స్, యాప్స్ ఉంటే మీ ఇల్లే ఆఫీస్‌గా మారిపోతుంది
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ ల్యాప్‌టాప్‌పై కరోనా వైరస్ ఉండొచ్చు
Work From Home: ఈ 9 టిప్స్‌తో మీ వైఫై స్పీడ్ పెంచుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Google, Lockdown, Sunder Pichai, Work From Home