హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Good News: ఎంత మంచి వార్త.. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు.. కరోనాతో భయపడే వారికి..

Good News: ఎంత మంచి వార్త.. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు.. కరోనాతో భయపడే వారికి..

అన్నం (food) తినే సమయంలో నీరు తాగాలి. కానీ, భోజనానికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల తర్వాత నీళ్లు తాగకూడదు.

అన్నం (food) తినే సమయంలో నీరు తాగాలి. కానీ, భోజనానికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల తర్వాత నీళ్లు తాగకూడదు.

చిన్న పిల్లల్లో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయట. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిలో 55.7 శాతం యాంటీబాడీస్ ఉన్నట్టు సీరో ప్రివిలెన్స్ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో అందరి ముందు ఉన్న ప్రశ్నల్లో ఒకటేంటంటే.. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ ప్రభావం చిన్న పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ సందేహానికి సమాధానాలు వెతికేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పెద్దగా ప్రభావం చూపదంటున్నారు. మరికొందరు ప్రభావం ఉండొచ్చని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎయిమ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో కరోనా వైరస్ ప్రభావం పిల్లల మీద కచ్చితంగా ఉంటుందనడానికి ఎలాంటి సహేతుకమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇదో గుడ్ న్యూస్. దీనికి అదనంగా ఇప్పుడు మరో గుడ్ న్యూస్ కూడా వచ్చింది. అదేంటంటే.. చిన్న పిల్లల్లో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయట. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిలో 55.7 శాతం యాంటీబాడీస్ ఉన్నట్టు సీరో ప్రివిలెన్స్ తెలిపింది.

దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 4509 మంది వద్ద నుంచి డేటాను సేకరించిన విశ్లేషించారు. దీంతో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. మొత్తం 10వేల మంది వద్ద నుంచి డేటాను సేకరించాలనుకున్నారు. అందులో పెద్దలు, పిల్లలు కూడా ఉన్నారు. వారు సేకరించిన డేటా ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పిల్లల్లో 55.7 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. 18 ఏళ్ల కంటే వయసు ఎక్కువ ఉన్నవారిలో అది 63.5 శాతంగా ఉంది. అంటే దాదాపు పెద్ద వారి కంటే కొంచెం తక్కువగా మాత్రమే పిల్లల్లో యాంటీబాడీలు ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఉధృతంగా జరుగుతోంది. 18 సంవత్సరాలు పైబడిన వారు అందరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. రాష్ట్రాలు ఓ ఉద్యమంలా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాయి. అయితే, కొన్నిచోట్ల వ్యాక్సిన్ లభ్యత లేదనే వాదన కూడా ఉంది. ఇదే సమయంలో పెద్దవారికి వ్యాక్సిన్ వస్తుంది.. వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.. కరోనాను ఢీకొట్టగల శక్తి వస్తుందని.. కానీ, పిల్లల పరిస్థితి ఏంటనే భయం చాలా మందిలో నెలకొంది. అయితే, అలాంటి భయం అవసరం లేదని ఈకొత్త సర్వే చెబుతోంది.

Watch Video: సూది మొనపై యోగా చేస్తున్నట్టుగా అద్భుతంగా చెక్కాడు


నేటి నుంచి ఉచితంగా కరోనా టీకాలు

జూన్ 21 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తామని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే కొన్ని రాష్ట్రాలు కూడా తాము ఉచితంగా టీకాలు వేస్తామని ఇది వరకే ప్రకటించాయి. టీకా కోసం కోవిన్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ అవసం లేదు. నేరుగా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడే ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసి టీకాలు వేస్తారు. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 75 శాతం వాటిని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగానే సరఫరా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటుచేసి ప్రజలకు పంపిణీ చేస్తుంది.

First published:

Tags: Corona Vaccine, Coronavirus, Covid-19, COVID-19 vaccine

ఉత్తమ కథలు