Covaxin Kids : మనదేశంలో చిన్నారులకు త్వరలో కొవాగ్జిన్.. గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్

ప్రతీకాత్మక చిత్రం

Covaxin: కరోనా తొలి, సెకెండ్ వేవ్ లో ప్రపంచాన్ని గడగడలాడించాయి. రెండో దశ ముగింపులో ఉన్నప్పటికీ ఇంకా భయాలు వీడలేదు.. అక్కడక్కడే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యండా డెల్టా వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్పడంతో కలవరపెడుతోంది. అయితే భారత్ భయోటెక్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. మరి ఎప్పటి నుంచి వ్యాక్సిన్ వేస్తారు.. డోస్ లు ఎలా తీసుకోవాలి..?

  • Share this:
    Covaxin Kids: కరోనా (Corona) మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు. వైరస్ (Virus) వ్యాప్తి తగ్గినట్టే కనిపించి.. మళ్లీ అక్కడక్కడా కోరాలు చాచుతోంది. మరోవైపు థర్డ్ వేవ్  (Third wave alret) కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఇంకా భయాలు వీడ లేదు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం వ్యాక్సిన్ ((Vaccine) మాత్రమే.. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది. ఇప్పటికే చాలామంది వ్యాక్సినేట్ అయ్యి ఉన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగం చేసే దిశగా దేశ వ్యాప్తంగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో భారత్ బయోటెక్ సంస్థ (Bharat Biotech) మరో శుభవార్త చెప్పింది. కరోనా నియంత్రణ కోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతున్నట్టు ప్రకటించింది. ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా కోవాక్జిన్ అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కోవాగ్జిన్ (Covaxin) తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. త్వరలో చిన్న పిల్లలకు కూడా అందించేందుకు కొవాగ్జిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే 2,3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు వచ్చే వారానికి అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది.  థర్డ్ వేవ్ హెచ్చరికల  నేపథ్యంలో ఇది శుభవార్తే అని చెప్పాలి.

    చిన్న పిల్లల వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పటికే ‘ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి అన్నారు. డీసీజీఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీనికి తోడు 18 ఏళ్లు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్‌‌లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

    ఇదీ చదవండి: లైంగిక సమస్యలకు దివ్య ఔషధం యాలకులు.. వీటి పెంపకంతో లక్షలు సంపాదించే ఛాన్స్.. ఎలా సాగు చేయాలంటే?

    అయితే ప్రస్తుతం ప్రపంచాన్నంతా డెల్టా వేరియంట్లు భయపెడుతున్నాయి. రోజుకో కొత్త వేరియంట్ తెరపైకి వస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారిని కూడా కరోనా వదలడం లేదు. దీంతో వ్యాక్సిన్ లు ఎంత సురక్షితం అనే అనుమానాలు ఉన్నాయి. కానీ కోవిడ్ 19 వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ డెల్టా ప్లస్ వేరియంట్‌పై సమర్థవంతంగా పని చేస్తోందని ఐసీఎంఆర్ ఇటీవల తమ అధ్యయనంలో స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: మృదువైన చర్మం కోసం ఆరాటపడుతున్నారా? ఈ 6 చిట్కాలు పాటించండి! కొద్ది రోజుల్లోనే తేడా చూస్తారు

    భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా కోవాగ్జిన్‌ను రూపొందించాయి. డెల్టా వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది కరోనాకు చెందిన మిగతా వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రస్తుతందేశంలో 70 డెల్టా ప్లస్ కేసులను గుర్తించినట్టు కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించింది. కోవాగ్జిన్ కరోనా ఇన్‌ఫెక్షన్‌పై 77.8 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని గత నెలలోనే భారత్ బయోటెక్ తెలిపింది. డెల్టా వేరియంట్‌ను 65.2 శాతం రక్షణ ఇస్తుందని వెల్లడించింది. ఇప్పటికే భారత్ సహా బ్రెజిల్, ఫిలిప్పిన్స్ వంటి 15 దేశాలు ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ చ్చింది. ఇక 2 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలపై సెకండ్ డోస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ట్రయల్స్ సాగుతున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: