రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఏప్రిల్ 15 నుంచి రైళ్లు తిరగనున్నాయి. కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14న ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో భారతీయ రైల్వే ఏప్రిల్ 15న సేవల్ని పునరుద్ధరించనుందని
ఎకనమిక్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది. రైల్వే సేవలు పూర్తి స్థాయిలో కాకుండా క్రమక్రమంగా అందుబాటులోకి వస్తాయని ఆ వార్త సారాంశం. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. అయితే లాక్డౌన్ పూర్తి కాగానే ప్యాసింజర్ సేవలు ఒక్కసారిగా ప్రారంభం కావన్నారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మార్చి 22 నుంచి మార్చి 31 వరకు ప్యాసింజర్ సేవల్ని నిలిపివేస్తూ ప్రకటన జారీ చేసింది భారతీయ రైల్వే. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైల్వే కూడా ఏప్రిల్ 14 వరకు ప్యాసింజర్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. కానీ నిత్యావసర వస్తువులు, ఇతర సరుకులు, వైద్య పరికరాలను రవాణా చేసేందుకు గూడ్స్ రైళ్లను ఎప్పట్లాగే నడుపుతోంది. రోజుకు 9,000 గూడ్స్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ ఇలా పొందండి
SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా
EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్లోకి... విత్డ్రా చేయండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:April 02, 2020, 09:46 IST