Indian Railways: ప్రభుత్వ ఉద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త

11.58 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం వల్ల రైల్వే శాఖ మీద రూ.2081.68 కోట్ల భారం పడనుంది.

Indian Railways | కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో రైల్వే తన వంతు చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వైద్య సేవల కోసం రైల్వే ఆస్పత్రులను ఉపయోగించుకోవచ్చని రైల్వే ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఆస్పత్రులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఐడెంటిటీ కార్డ్ చూపించి వైద్య సేవలు పొందొచ్చు. రైల్వే ఆస్పత్రులు కేవలం రైల్వే ఉద్యోగులకు మాత్రమే వైద్య సేవల్ని అందించేవి. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

    కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో రైల్వే తన వంతు చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన రైల్వే... గూడ్స్ ట్రైన్ల ద్వారా సరుకుల్ని, అత్యవసర వస్తువుల్ని, వైద్య పరికరాలను రవాణా చేస్తోంది. అంతేకాదు... ప్రయోగాత్మకంగా రైలు కోచ్‌ను ఐసోలేషన్ వార్డుగా మార్చేసింది రైల్వే. ప్రతీ కోచ్‌లో 16 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందించేలా రూపొందించింది. అవసరమైతే 20,000 కోచ్‌లను 3,20,000 బెడ్స్‌గా మార్చి ట్రైన్ హాస్పిటల్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామంటోంది రైల్వే.

    ఇవి కూడా చదవండి:

    Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్‌పై క్లారిటీ ఇచ్చిన రైల్వే

    Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక... ఈ విషయాలు మర్చిపోవద్దు
    Published by:Santhosh Kumar S
    First published: