Insurance: ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నవారికి ఐఆర్‌డీఏఐ గుడ్ న్యూస్

Insurance | ఇన్స్యూరెన్స్ పాలసీ రెన్యువల్ ప్రీమియం చెల్లించాలనుకునేవారికి ఐఆర్‌డీఏఐ ఊరట కల్పించింది. గ్రేస్ పీరియడ్‌ను మరో 30 రోజులు పొడిగించాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలను కోరింది ఐఆర్‌డీఏఐ.

news18-telugu
Updated: March 25, 2020, 11:11 AM IST
Insurance: ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నవారికి ఐఆర్‌డీఏఐ గుడ్ న్యూస్
Insurance: ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నవారికి ఐఆర్‌డీఏఐ గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నాయా? హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాస్ తీసుకున్నారా? ఈ నెల రోజుల్లో వాటి ప్రీమియం చెల్లించాల్సి ఉందా? ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ప్రీమియం చెల్లించలేకపోతున్నారా? అయితే మీకు శుభవార్త. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI పాలసీ హోల్డర్లకు ఊరట కల్పించేలా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. పాలసీ హోల్డర్లు తమ ప్రీమియం చెల్లించేందుకు 30 రోజులు అదనంగా గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ప్రీమియం చెల్లించాల్సిన వారికి 2020 ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే.

సాధారణంగా ప్రతీ పాలసీపై కొన్ని రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రీమియం గడువు ముగిసినా గ్రేస్ పీరియడ్‌లో ప్రీమియం చెల్లించొచ్చు. గ్రేస్ పీరియడ్ కూడా దాటితే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించాయి. అందుకే లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు పాలసీ హోల్డర్లకు 30 రోజులు అదనంగా గడువు ఇవ్వాలని ఆదేశించింది ఐఆర్‌డీఏఐ. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీల రెన్యువల్ ప్రీమియంను 30 రోజుల వరకు ఆలస్యంగా చెల్లిస్తే పాలసీని బ్రేక్ చేయొద్దని కోరింది. అందుకే కవరేజీలో నిలుపుదల ఉండకుండా కంపెనీలు పాలసీహోల్డర్లను కాంటాక్ట్ చేయాలని కోరింది.

ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్నందున పాలసీహోల్డర్లకు, కస్టమర్లకు సేవలు అందించేందుకు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీలు డిజిటల్, టెలిఫోనిక్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తమతమ వెబ్‌సైట్లలో అప్‌డేట్ చేయాలని సూచించింది. ప్రీమియం పేమెంట్స్, రెన్యువల్, క్లెయిమ్స్ సెటిల్మెంట్, ఇతర సేవలకు సంబంధించిన రిక్వెస్ట్‌ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి కస్టమర్లకు సమాచారాన్ని ఇవ్వాలని కోరింది.

ఇవి కూడా చదవండి:



SBI: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయాలా? ఈ ఫీచర్ ట్రై చేయండి

Good News: మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు... ఇంకా మరెన్నో శుభవార్తలు

Jio New Plans: రిలయెన్స్ జియో ప్రకటించిన 5 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలివే... 
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading