Home /News /coronavirus-latest-news /

GOOD NEWS FOR AADHAAR CARDHOLDERS 14000 AADHAAR KENDRAS OPEN IN INDIA SAYS UIDAI SS

Aadhaar: ఆధార్ సేవా కేంద్రాలు ఓపెన్... ఎక్కడెక్కడంటే

Aadhaar: ఆధార్ సేవా కేంద్రాలు ఓపెన్... ఎక్కడెక్కడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar: ఆధార్ సేవా కేంద్రాలు ఓపెన్... ఎక్కడెక్కడంటే (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Seva Kendra | లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఆధార్ సేవా కేంద్రాలు తెరుచుకున్నాయి. ఎక్కడెక్కడ ఆధార్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయో తెలుసుకోండి.

    మీ ఆధార్ కార్డులో వివరాలు మార్చాలా? బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించాలా? అయితే మీకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 14,000 ఆధార్ కేంద్రాలు తెరిచే ఉన్నాయని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ నిర్వహించే 14,000 ఆధార్ కేంద్రాలు తెరిచి ఉన్నట్టు తెలిపింది. ఇక యూఐడీఏఐ స్వయంగా నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల ఆధార్ సేవా కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్, వరంగల్‌లోని నయీంనగర్, విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్నంలోని ద్వారకానగర్‌లో యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఈ 4 ఆధార్ సేవా కేంద్రాలు తెరిచి ఉన్నట్టు యూఐడీఏఐ ప్రకటించింది. మిగతా ఆధార్ కేంద్రాలను తెరిపించేందుకు స్థానిక ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు యూఐడీఏఐ తెలిపింది.


    మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఆధార్ సేవా కేంద్రాలు కూడా మూతపడ్డాయి. అయితే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఆధార్ కార్డుల్లో సమస్యలు ఏర్పడ్డాయి. ఆధార్ కార్డులో తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కొన్ని చోట్ల ఆధార్ కేంద్రాలు తెరుచుకున్నాయి. ఇటీవల లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 14,000 ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు యూఐడీఏఐ నిర్వహించే ఆధార్ సేవా కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి. ఆధార్ సేవా కేంద్రాల్లో సేవల్ని పొందాలనుకుంటే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Lock Aadhaar: ఇలా చేస్తే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోలేరు

    Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చు

    Download Aadhaar: ఈ స్టెప్స్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు